వి.బి-జీ రామ్ జీ అమల్లో తెలంగాణ ప్రభుత్వ కృషిని కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రశంసిస్తూ తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్కకు ఈరోజు లేఖ రాశారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి తెలంగాణకు రూ.3,825.3 కోట్ల నిధులను కేటాయించినట్లు వెల్లడించారు. తెలంగాణ ప్రతిపాదించిన గృహ నిర్మాణ పథకంతో పాటు పలు పనులకు అనుమతి ఇచ్చినట్లు శివరాజ్ సింగ్ చౌహాన్ స్పష్టం చేశారు. వి.బి-జీ రామ్ జీ కింద ఇప్పటివరకు రాష్ట్రంలో 1.83 కోట్ల పనిదినాలను కల్పించినట్లు ప్రస్తావించారు. కేంద్రమంత్రి లేఖలో తెలంగాణ ప్రభుత్వ కృషిపై ప్రశంసలు కురిపించారు. గ్రామీణ కుటుంబాలకు ఉపాధి కల్పన, చట్ట నిబంధనల అమల్లో రాష్ట్ర ప్రభుత్వ నిబద్ధతను కొనియాడారు. రాష్ట్రంలో పలు పనులను అమలు చేయడం, ప్రారంభించడంపై కేంద్రమంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సూచించిన అదనపు పనుల ప్రతిపాదనలకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. వి.బి-జీ రామ్ జీ కింద అనుమతించిన పనుల జాబితా 375కు విస్తరిస్తామని తెలిపారు. తెలంగాణ ప్రతిపాదించిన రాష్ట్ర గృహ నిర్మాణ పథకానికి కూడా అనుమతి ఇస్తామని స్పష్టం చేశారు. గ్రామీణ ఉపాధి కల్పనలో తెలంగాణ సాధించిన పురోగతిని గుర్తించామని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు.
3
Beranda
› commending the Telangana government's efforts
› Implementation of V.B.-G. Ramji
› national
› Union Minister Shivraj Singh Chouhan writes to Minister Seethakka
› వి.బి-జీ రామ్ జీ అమలు : తెలంగాణ ప్రభుత్వ కృషిని ప్రశంసిస్తూ మంత్రి సీతక్కకు లేఖ రాసిన కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్
Subscribe to:
Post Comments (Atom)
