తెలంగాణలోని నల్లగొండ జిల్లా కనగల్ మండలం శాబ్దుల్లాపురం గ్రామానికి చెందిన కోయ యాదగిరిరెడ్డి, రూప దంపతుల కుమార్తె కోయ శ్రీజ (23) అమెరికాలోని బోస్టన్ నగరంలో అదృశ్యమయ్యారు. నవంబర్ 2వ తేదీ నుంచి ఆమె ఆచూకీ లభించకపోవడంతో బోస్టన్ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. బోస్టన్‌లోని డోర్చెస్టర్ ప్రాంతంలో నివాసముంటున్న శ్రీజ నవంబర్ 2వ తేదీ రాత్రి సుమారు 9:45 గంటల సమయంలో ఎడిసన్ గ్రీన్ సమీపంలో చివరిసారిగా కనిపించినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం వచ్చింది. ఆ రోజు కాలేజీకి వెళ్లిన అనంతరం పార్ట్‌టైమ్ ఉద్యోగం ముగించుకుని తన గదికి చేరుకుంది. శ్రీజతో పాటు మరో ఎనిమిది మంది యువతులు అదే ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. వారిలో ఓ యువతి పుట్టినరోజు వేడుకలకు శ్రీజను ఆహ్వానించగా, వస్తానని స్నేహితులకు చెప్పినట్లు బంధువులు పేర్కొన్నారు. అయితే వేడుకలకు స్నేహితులు ఏర్పాట్లు చేసుకుంటుండగా, కాసేపు సరదాగా వాకింగ్ చేసి వస్తానని చెప్పి బయటకు వెళ్లింది. ఎంతసేపటికీ తిరిగి రాకపోవడంతో స్నేహితులు ఆమె తల్లిదండ్రులకు సమాచారం అందించారు. అనంతరం స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. శ్రీజ వెళ్లిన తర్వాత ఆమె ఫోన్ సుమారు అర కిలోమీటరు పరిధి వరకు మాత్రమే నెట్‌వర్క్‌లో కనిపించిందని, ఆ తర్వాత స్విచ్ఛాఫ్ అయిందని తండ్రి యాదగిరిరెడ్డి తెలిపారు. ప్రస్తుతం శ్రీజ ఎంఎస్ రెండో సంవత్సరం చదువుతోంది. మరో ఆరు నెలల్లో చదువు పూర్తికానుండగా ఇంతలోనే అదృశ్యం కావడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. ఆమె కార్సన్ బీచ్ లేదా హార్బర్ పాయింట్ పరిసర ప్రాంతాల్లో ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నట్లు సమాచారం.
3
Beranda
› daughter of Koya Yadagiri Reddy and Rupa
› Goes Missing in the USA
› Kanagal mandal
› Koya Sreeja
› Shabdullapuram village
› Student from Nalgonda
› telangana
› అమెరికాలో నల్గొండ విద్యార్థిని కోయ శ్రీజ అదృశ్యం
Subscribe to:
Post Comments (Atom)
