About LATEST NEWS AP TO TG

Telugu computer tutorials Unicode to Anu conversion smartphone tips Telugu Use smartwatch tips Telugu EV news Telugu tech upd

Manual Description Here: Ea eam labores imperdiet, apeirian democritum ei nam, doming neglegentur ad vis.

3
Showing posts with label 'Honda CB 500' Bike Launched. Show all posts
Showing posts with label 'Honda CB 500' Bike Launched. Show all posts

హోండా సీబీ 500 బైక్ విడుదల

దేశీయ మార్కెట్లో ‘హోండా సీబీ500’ బైక్‌ను హోండా సంస్థ విడుదల చేసింది. దీని ప్రారంభ ఎక్స్‌షోరూమ్ ధరను రూ.2.75 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. భారీ ఎయిర్-కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజిన్‌తో వస్తున్న ఈ మోటార్‌సైకిల్ మొత్తం మూడు వేరియంట్లలో అందుబాటులో ఉండనుంది. ఇప్పటికే అధికారిక బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి. ఈ బైక్‌లో సరికొత్త 501సీసీ సింగిల్ సిలిండర్, ఎయిర్ అండ్ ఆయిల్-కూల్డ్ ఇంజిన్‌ను అమర్చారు. ఇది 5,250 ఆర్‌పీఎమ్ వద్ద 28 హెచ్‌పీ పవర్, 3,750 ఆర్‌పీఎమ్ వద్ద 43.3 ఎన్ఎమ్ గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ప్రస్తుతం భారత మార్కెట్లో హోండా నుంచి అందుబాటులోకి వచ్చిన అతిపెద్ద ఎయిర్-కూల్డ్ సింగిల్ సిలిండర్ బైక్ ఇదే కావడం విశేషం. స్లిప్-అండ్-అసిస్ట్ క్లచ్‌తో కూడిన 5-స్పీడ్ గేర్‌బాక్స్‌ను దీనికి జతచేశారు. ప్రయాణికుల భద్రత కోసం ఈ బైక్‌లో ముందూ వెనుకా డ్యూయల్ డిస్క్ బ్రేకులు, డ్యూయల్ ఛానల్ ఏబీఎస్ వంటి ఆధునిక ఫీచర్లు అందించారు. ముందు వైపు 19 అంగుళాల వీల్, వెనుక 17 అంగుళాల వీల్‌ను అమర్చారు. ఇక సౌకర్యవంతమైన రైడింగ్ కోసం ముందు టెలిస్కోపిక్ ఫోర్క్, వెనుక వైపు ప్రీలోడ్ అడ్జస్టబుల్ గ్యాస్-ఛార్జ్డ్ ట్విన్ షాక్ అబ్జార్బర్లను సస్పెన్షన్‌గా ఇచ్చారు. 189 కిలోల బరువు, 168 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్‌తో రూపొందిన ఈ బైక్ సిటీ రైడ్స్‌తో పాటు లాంగ్ డ్రైవ్‌లకు ఎంతో అనుకూలంగా ఉంటుంది. బేస్ అల్లాయ్ మోడల్ ధర రూ.2.75 లక్షలుగా ఉంది. ఇది పెర్ల్ ఇగ్నియస్ బ్లాక్, పెర్ల్ డీప్ గ్రౌండ్ గ్రే రంగుల్లో లభిస్తుంది. క్రాస్-స్పోక్ ట్యూబ్‌లెస్ రిమ్స్‌తో వచ్చే మిడ్-స్పెక్ స్పోక్ వేరియంట్ ధర రూ.3 లక్షలుగా నిర్ణయించారు. ఇందులో రెబెల్ రెడ్ మెటాలిక్, మ్యాట్ స్టీల్ సిల్వర్ మెటాలిక్ రంగులు ఉన్నాయి. ప్రత్యేకమైన రంగులు, ఆకర్షణీయమైన గ్రాఫిక్స్‌తో వచ్చే టాప్-ఎండ్ వేరియంట్ ధర రూ.3.02 లక్షలు. ఇది స్ట్రైప్స్‌తో కూడిన సింగిల్ పెర్ల్ ఇగ్నియస్ బ్లాక్ కలర్‌లో అందుబాటులో ఉంటుంది. 

Read More...