హైదరాబాద్ లోని ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హబ్సిగూడ సాయిచిత్ర నగర్ కాలనీలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కాలనీలోని స్ట్రీట్ నంబర్ 5లో అలంకరణ సామగ్రి నిల్వ ఉంచిన ఓ షెడ్డులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. కాచిగూడలోని బసంత్ కాలనీకి చెందిన ఆదిత్య జైన్ ఈ షెడ్డును అద్దెకు తీసుకుని వినోద కార్యక్రమాలకు సంబంధించిన సామగ్రితో పాటు వివిధ రకాల అలంకరణ వస్తువులను నిల్వ ఉంచారు. ఈ క్రమంలో షెడ్డులో మంటలు చెలరేగడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో లక్ష రూపాయలకు పైగా విలువైన ఆస్తి నష్టం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. టపాసులు కాల్చడం వల్లే మంటలు చెలరేగి ఉంటాయని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, అగ్నిప్రమాదానికి గల కచ్చితమైన కారణాలు తెలియాల్సి ఉంది.
3
Beranda
› crime
› Fire Breaks Out in a Shed Storing Decoration Materials in Habsiguda
› hyderabad
› located within the limits of the Uppal Police Station
› Sai Chitra Nagar Colony
› telangana
› హబ్సిగూడలో అలంకరణ సామగ్రి నిల్వ ఉంచిన షెడ్డులో అగ్నిప్రమాదం
Subscribe to:
Post Comments (Atom)
