తెలంగాణాలో ఎల్‌నినో ప్రభావంతో కరవు పరిస్థితులు నెలకున్నాయి. రైతులు ఆర్దికంగా ఇబ్బందుల్లో ఉన్నారు. ఈ సమయంలో అర్హులైన రైతుల పంట రుణాలు రీ షెడ్యూల్ చేయాలని బ్యాంకర్లను ప్రభుత్వం కోరింది. రైతులకు బ్యాంకు లు అండగా నిలవాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సూచించారు. రైతులకు ప్రభుత్వం నుంచి అందాల్సిన సాయం అందిస్తున్నామని.. రుణాల విషయంలో బ్యాంకర్లు సానుకూలంగా నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ఎల్ నినో పరిస్థితుల వేళ రైతాంగానికి అండగా నిలవాల్సిన అవసరం ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ప్రత్యేక రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశంలో ఈ మేరకు కీలక సూచనలు చేసారు. కరవు పరిస్థితులను ఎదుర్కొనేందుకు బ్యాంకులు ప్రత్యేక చొరవ చూపాలని... అర్హులైన రైతుల పంట రుణాలను రీషెడ్యూల్ చేయాలని ఆదేశించారు. రబీ సీజన్‌కు కొత్త పంట రుణాలను సకాలంలో అందించాలని భట్టి సూచించారు. బ్యాంకుల చుట్టూ రైతులు తిరిగే పరిస్థితి ఉండకూడదని తెలిపారు. విద్యా, గృహ రుణాల మంజూరులో బ్యాంకులు సానుకూలంగా ఉండాలని నిర్దేశించారు. ఎంఎస్ఎంఈ, మౌలిక సదుపాయాల రంగాలకు రుణాలు పెంచాలని ఆదేశించారు. రాష్ట్రంలోని 365 మండలాలను కరవు ప్రాంతాలుగా ప్రకటించామని.. 111 మండలాల్లో తీవ్ర కరవు పరిస్థితులు ఉన్నట్లు తెలిపారు. తక్కువ నీటితో సాగయ్యే పంటలకు రుణాలు అందించాలని.. పంటల మార్పిడి, సూక్ష్మ సేద్యానికి ఆర్థిక సహకారం అందించాలని అధికారులను ఆదేశించారు. అదే విధంగా రైతులకు ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలు కల్పించాలని ఉపముఖ్యమంత్రి సూచించారు. 10 నుంచి 15 శాతం రైతు కుటుంబాలకు అదనపు ఉపాధి కల్పించేలా చర్యలు చేపట్టాలన్నారు. స్వయం సహాయక సంఘాలకు అదనంగా రూ.2 లక్షల వరకు రుణాలపై పరిశీలన చేయాలని అన్నారు. నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి రుణాలు ఇవ్వాలని నిర్దేశించారు. ఈ నెల 19 నాటికి రాజీవ్ యువ వికాసం అమలుకు బ్యాంకర్లు సహకరించాలని సూచించారు. రైతులు తదుపరి వ్యవసాయ సీజన్‌ను ఆత్మవిశ్వాసంతో ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు.
3
Beranda
› Deputy Chief Minister Bhatti Vikramarka urged banks to stand by the farmers
› Due to the impact of El Niño
› Government Urges Bankers to Reschedule Crop Loans in Telangana
› తెలంగాణాలో పంట రుణాల రీషెడ్యూల్ చేయాలని బ్యాంకర్లను ప్రభుత్వం
Subscribe to:
Post Comments (Atom)
