ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ ప్రాంతంలో జవాన్లతో కలిసి ప్రధాని నరేంద్ర మోడీ దీపావళి సంబరాల్లో పాల్గొన్నారు. కరన్‌పూర్‌లోని కోబ్రా ఆపరేషన్స్ బేస్‌ను సందర్శించిన ప్రధాని, తొలుత అమరవీరుల స్మారక స్థూపం వద్ద నివాళులర్పించారు. అనంతరం జవాన్లను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. “సాయుధ నక్సలైట్లను అడవుల నుంచి పూర్తిగా తుడిచిపెట్టాం. కానీ ప్రమాదం ఇంకా పొంచి ఉంది. ‘దిమాగీ నక్సల్స్’ (అర్బన్ నక్సల్స్) అనేక సంస్థలను, రాజకీయ పార్టీలను ఆక్రమించారు. వారు దేశ రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా దుష్ప్రచారం చేస్తున్నారు. అటువంటి వారిని గుర్తించి ఓడించడం ద్వారా దేశ భద్రతను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది” అని పిలుపునిచ్చారు. గతంలో పాలించిన ప్రభుత్వాలు నక్సల్ వ్యతిరేక పోరాటంలో ఉన్న సైనిక దళాల స్వేచ్ఛను హరించాయని ప్రధాని మోడీ విమర్శించారు. “గతంలో నక్సల్ దాడులు జరిగినప్పుడు ఎదురుదాడి చేసేందుకు భద్రతా బలగాలకు పూర్తి స్వేచ్ఛ ఉండేది కాదు. కానీ మా ప్రభుత్వం వచ్చాక భద్రతా దళాలకు పూర్తి అధికారాలు ఇచ్చాం. ప్రభుత్వ వ్యవస్థల్లోనే ఉంటూ నక్సలిజానికి మద్దతు ఇచ్చిన వ్యక్తుల నెట్‌వర్క్‌ను సైతం మట్టుబెట్టాం” అని పేర్కొన్నారు. మావోయిస్టు రహిత ప్రాంతంగా బస్తర్ మారుతోందని, ఆప్యాయతతో కూడిన సేవ ద్వారా నక్సల్ ప్రభావిత ప్రాంత ప్రజల్లో ప్రభుత్వం నమ్మకాన్ని నింపిందని మోడీ తెలిపారు. వేడుకల సందర్భంగా భద్రతా దళాల జవాన్లు ప్రధాని సమక్షంలో గిరిజన సాంప్రదాయ నృత్యాలు చేస్తూ ఉత్సాహంగా గడిపారు. “భారత్ మాతాకీ జై” నినాదాలతో కరన్‌పూర్ క్యాంప్ మారుమోగింది.
3
Beranda
› it is essential to identify and defeat them to safeguard the nation’s security
› national
› Prime Minister Narendra Modi
› Urban Naxals have infiltrated various organizations and political parties
› అర్బన్ నక్సల్స్ అనేక సంస్థలను, రాజకీయ పార్టీలను ఆక్రమించారు : వారిని గుర్తించి ఓడించడం ద్వారా దేశ భద్రతను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది
Subscribe to:
Post Comments (Atom)
