ఉత్తరప్రదేశ్ లోని మీరట్ నగరంలో పెన్షన్ డబ్బు కోసం ఇంట్లో రోజూ జరిగే గొడవలు, చివరకు ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి జీవితాలను ఒక్కరోజులోనే నాశనం చేశాయి. మరణించిన తన భర్త పెన్షన్ డబ్బుకు సంబంధించిన విషయంలో వృద్ధురాలికి మరియు ఆమె కుమారుడికి మధ్య చాలా రోజులుగా తీవ్ర వాగ్వాదం జరుగుతోంది. డబ్బును పూర్తిగా తన ఆధీనంలోనే ఉంచుకోవాలని ఆ తల్లి భావించగా, కుమారుడు మాత్రం అందులో తన వాటా అడుగుతూ నిరంతరం ఒత్తిడి తెస్తున్నాడు. దీంతో ఆగ్రహానికి గురైన ఆ వృద్ధురాలు, కన్న కొడుకు, మనవడుపై యాసిడ్ పోసింది. యాసిడ్ పడగానే నొప్పితో వారు వేసిన కేకలు విని ఇరుగుపొరుగు వారు పరుగెత్తుకుంటూ వచ్చారు. కొడుకు, మనవడిపై యాసిడ్ దాడి చేసిన వెంటనే, ఆ వృద్ధురాలు ఇంటిలోని మరో గదిలోకి వెళ్లి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ప్రాణాపాయ స్థితిలో అల్లాడిపోతున్న ఇద్దరినీ మీరట్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ホーム
/
Uttar Pradesh
/
పెన్షన్ డబ్బు కోసం వేధించిన కుమారుడు : కుమారుడు, మనవడుపై యాసిడ్ పోసి ఆత్మహత్య చేసుకున్న వృద్ధురాలు
Monday, September 21, 2026
crime Elderly Woman Throws Acid on Son and Grandson Meerut Son Harassed Her for Pension Money then commits suicide Uttar Pradesh
No comments:
Post a Comment