యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై స్లీపర్‌ బస్సు విషాదం : డ్రైవర్, కండక్టర్ నిర్లక్ష్య ధోరణే ఈ విషాదానికి దారి తీసిందని ఆరోపణలు

Thursday, September 24, 2026

Allegations Point to Driver and Conductor Negligence Greater Noida national traveling from Delhi to Mahoba Uttar Pradesh Yamuna Expressway Sleeper Bus Tragedy

t f B! P L

త్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర బస్సు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. అయితే ఈ ఘటనకు సంబంధించిన షాకింగ్‌ విషయాలు వెలుగులోకి వచ్చింది. ఈ స్లీపర్ టూరిస్ట్ బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు మంటలు చెలరేగడానికి ముందే కాలిపోతున్న వాసన వస్తోందని పదే పదే హెచ్చిరించినా వినకుండా డ్రైవర్, కండక్టర్ నిర్లక్ష్య ధోరణే ఈ ఘోర విషాదానికి దారి తీసిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఢిల్లీ నుండి ఉత్తరప్రదేశ్‌లోని మహోబా వెళ్తున్న ఈ బస్సులో ఏదో కాలుతున్న వాసన వస్తున్నట్టు ప్రయాణీకులు బస్సు డ్రైవర్, కండక్టర్‌కి చెప్పారు. బస్సులో ప్రయాణిస్తున్న సునీల్ కుమార్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏదో కాలుతున్న వాసన వస్తోందని ప్రయాణికులు పదేపదే హెచ్చరించినప్పటికీ వాటిని పట్టించుకోలేదు. అంతేకాకుండా, డ్రైవర్,కండక్టర్ క్యాబిన్‌లో సిగరెట్లు తాగడం కొనసాగించారు. ఆ తర్వాత కొద్దిసేపటికే, డ్రైవర్ సీటు సమీపంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ప్రయాణికులు కేకలు వేస్తూ బస్సును ఆపమని డ్రైవర్‌ను కోరారు. అయితే, డ్రైవర్ , కండక్టర్ తమలో తాము నవ్వుకుంటూ, ప్రయాణికుల విజ్ఞప్తులను తిరస్కరించి, బస్సు ఆపడానికి నిరాకరించారని ఎఫ్‌ఐఆర్ నమోదైంది. "మీరు చచ్చిపోయినా పర్వాలేదు, నేను బస్సు ఆపను" అని నిర్లక్ష్యంగా సమాధానమిచ్చినట్లు ఎఫ్‌ఐఆర్‌లో నమోదైంది. మంటలు చెలరేగిన తర్వాత డ్రైవర్, కండక్టర్ పరారయ్యారు.అనంతరం బస్సు డ్రైవర్, కండక్టర్లను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.  ఆ బస్సుపై పలు ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనకు సంబంధించి 60కి పైగా చలాన్లు ఉన్నట్లు తేలింది. ఇంకా సుమారు రూ. 1.7 లక్షల జరిమానాలు చెల్లించాల్సి ఉంది.

Random Post

    Total Pageviews

    Search This Blog

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    Contact Form

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ