ఆసియా గేమ్స్ : భారత్ ఖాతాలో 15 పతకాలు : పతకాల పట్టికలో 14వ స్థానం
జపాన్ వేదికగా జరుగుతున్న ఆసియా గేమ్స్ లో భారత్ ఇప్పటివరకు మొత్తం 15 పతకాలు సాధించింది. ఇందులో 1 స్వర్ణం, 6 రజతాలు, 8 కాంస్య పతకాలు ఉన్నాయి. పతకాలు పట్టికలో భారత్ 14వ స్థానంలో కొనసాగుతోంది. ప్రస్తుతం 67 స్వర్ణాలు, 24 రజతాలు, 10 కాంస్య పతకాలతో కలిపి మొత్తం 101 పతకాలతో చైనా నంబర్ వన్ స్థానంలో ఉంది. 74 పతకాలతో జపాన్ రెండో స్థానంలో నిలిచింది.