బెంగళూరులో చదువు కోసం వెళ్లిన పూజ అనే యువతి 3బీహెచ్‌కే ఫ్లాట్‌ను నెలకు రూ.17 వేల అద్దెతో తీసుకోవాలని భావించింది. ఇంటి యజమాని విధించిన వింత షరతులు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. ఇంటి యజమానితో మాట్లాడిన తర్వాత ఆమెకు ఊహించని ఆంక్షలు ఎదురయ్యాయి. ఫ్లాట్‌లో ఇద్దరు మాత్రమే ఉండాలని, పురుష స్నేహితులు వస్తే వారి కుటుంబ సభ్యులతో మాట్లాడించాలని షరతు విధించారు. అంతేకాకుండా నీటి వినియోగం, పరిశుభ్రత వంటి విషయాల్లోనూ ఆంక్షలు పెట్టారు. శబ్దం చేయకూడదని, టెర్రస్‌పై అనవసరంగా తిరగకూడదని సూచించారు. ఈ షరతులన్నింటికీ మించి యజమాని మరో డిమాండ్ చేశారు. ఆరు నెలల లాక్‌ఇన్ పీరియడ్‌తో పాటు రూ.లక్ష సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాలని స్పష్టం చేశారు. ఆరు నెలలు పూర్తికాకముందే ఫ్లాట్ ఖాళీ చేస్తే డిపాజిట్ తిరిగి ఇవ్వబోమని చెప్పడంతో పూజ ఈ అద్దె ఒప్పందాన్ని తిరస్కరించినట్లు ఎక్స్‌లో ఓ యూజర్ వెల్లడించారు. నెలకు రూ.17 వేల అద్దె చెల్లించే ఇంటికి ఇన్ని ఆంక్షలు విధించడంపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇంటి యజమానులకు తమ ఆస్తిపై కొన్ని నిబంధనలు విధించే హక్కు ఉన్నప్పటికీ, అద్దెదారుల వ్యక్తిగత స్వేచ్ఛ, గోప్యతకు భంగం కలిగించేలా ఉండకూడదని పలువురు అభిప్రాయపడుతున్నారు. బెంగళూరులో అధిక సెక్యూరిటీ డిపాజిట్లు, బ్యాచిలర్లకు ఇళ్లు అద్దెకు ఇచ్చేందుకు నిరాకరించడం, సందర్శకులపై ఆంక్షలు విధించడం వంటి అంశాలు గతంలోనూ చర్చకు వచ్చాయి. తాజా ఘటన కూడా అద్దెదారుల హక్కులు, యజమానుల నిబంధనల మధ్య సమతుల్యతపై మరోసారి చర్చకు తెరలేపింది.
3
Beranda
› karnataka
› Landlord in Bengaluru Imposes Unexpected Restrictions on Rental Property
› national
› topic of discussion on social medi
› బెంగళూరులో అద్దె ఇంటికి ఊహించని ఆంక్షలు పెట్టిన యజమాని !
Subscribe to:
Post Comments (Atom)
