పాత కక్షలతో వ్యక్తి చేతులు కారు విండోలో ఇరికించి, ఈడ్చుకెళ్లి హత్య చేసిన దుండగులు

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో అర్రా ప్రాంతానికి చెందిన 37 ఏళ్ల బీరు సింగ్ ఒక ఆహార ఉత్పత్తుల సంస్థలో సేల్స్‌మన్‌గా పనిచేస్తున్నాడు. అక్టోబర్ 20న రాత్రి 10:30 గంటల సమయంలో బీరు సింగ్ దసరా ఉత్సవాల నుంచి ఇంటికి తిరిగి వెళ్తుండగా, పాత కక్షలు ఉన్న మేవాలాల్, రాజ్‌వీర్ మరో ముగ్గురు వ్యక్తులతో కలిసి అతడిని అడ్డగించారు. తొలుత వారి మధ్య గొడవ జరిగి, నిందితులు బీరు సింగ్‌పై దాడికి పాల్పడ్డారు. నిందితుల నుంచి తప్పించుకునేందుకు బీరు సింగ్ ప్రయత్నించగా, వారు తమ కారుతో అతడిని ఢీకొట్టారు. అనంతరం తీవ్రంగా గాయపడిన అతడిని కారు రూఫ్‌పైకి నెట్టి, చేతులను కారు విండోల మధ్యలో ఇరికించి కారును వేగంగా పోనిచ్చి, సుమారు ఒకటిన్నర కిలోమీటర్ల దూరం వరకు అలానే ఈడ్చుకెళ్లారు. ఆ తర్వాత అతడిని రోడ్డుపై కింద పడేసి, అతడిపై నుంచి కారు నడిపారు. దీంతో బీరు సింగ్  అక్కడిక్కకడే మృతి చెందాడు. హత్య చేసిన తరువాత నిందితులు  అక్కడి నుంచి పరారయ్యారు.

Post a Comment

Previous Post Next Post
3