ఆరు కీలక టాటా కంపెనీల బోర్డుల నుంచి వైదొలగనున్న నోయెల్ టాటా

టాటా ట్రస్ట్స్ చైర్మన్ నోయెల్ టాటా 70 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా వచ్చే నెల 12న ఆరు కీలక టాటా కంపెనీల బోర్డుల నుంచి వైదొలగనున్నారు. అయితే గ్రూప్ హోల్డింగ్ సంస్థ అయిన టాటా సన్స్ బోర్డులో ఆయన నామినీ డైరెక్టర్ పదవిలో కొనసాగుతారు. నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల పదవీ విరమణ వయస్సు 70 ఏళ్లు కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ట్రెంట్, వోల్టాస్, టాటా ఇంటర్నేషనల్, టాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్, టాటా స్టీల్, టైటాన్ కంపెనీల బోర్డుల నుంచి ఆయన తప్పుకోనున్నారు. టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ ఐదేళ్ల పదవీకాలాన్ని వ్యతిరేకిస్తూ నోయెల్ టాటా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న సమయంలో ఈ మార్పులు చోటుచేసుకున్నాయి. టాటా సన్స్ సంస్థలో టాటా ట్రస్ట్‌కు 66% వాటా ఉంది.

Post a Comment

Previous Post Next Post
3