దీపావళి పండుగ సమయంలో సురక్షితమైన వాతావరణాన్ని అందించడానికి ఫోన్‌పే ఒక ప్రత్యేకమైన ఇన్సూరెన్స్ పాలసీని అందుబాటులోకి తెచ్చింది. బాణసంచా కాల్చే సమయంలో జరిగే ప్రమాదాలకు ఆర్థిక రక్షణ కల్పించేందుకు ‘ఫోన్‌పే’ సంస్థ ‘ఆదిత్య బిర్లా హెల్త్ ఇన్సూరెన్స్’ కంపెనీతో జతకట్టింది. తన ప్లాట్ఫామ్లో “ఫైర్ క్రాకర్స్ ఇన్సూరెన్స్” అనే పేరుతో ఈ బీమాను ప్రవేశపెట్టింది. కేవలం రూ.11 నామమాత్రపు ప్రీమియం చెల్లించి ఈ ఇన్సూరెన్స్ కవరేజీని పొందవచ్చు. బాణసంచా వల్ల కాలిన గాయాలైనా లేదా ఇతర ప్రమాదాలు జరిగినా గరిష్టంగా రూ.25,000 వరకు వైద్య చికిత్స ఖర్చులను ఈ బీమా ద్వారా క్లెయిమ్ చేసుకోవచ్చు. ఈ ఇన్సూరెన్స్ పాలసీ ద్వారా పాలసీదారుడితో పాటు వారి జీవిత భాగస్వామి మరియు పిల్లలకు కూడా బీమా కవరేజీ లభిస్తుంది. ప్రమాదం జరిగి 24 గంటలకు పైగా ఆస్పత్రిలో నిమిత్తమై చికిత్స పొందినా లేదా డే కేర్ చికిత్సలు తీసుకున్నా ఈ బీమా ప్రయోజనం వర్తిస్తుంది. దీనివల్ల నెట్వర్క్ ఆస్పత్రుల్లో ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా వైద్య సేవలు పొందడానికి అవకాశం ఉంటుంది. వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా ఫోన్‌పే ఈ ఇన్సూరెన్స్‌లో రెండు రకాల ఆప్షన్లను అందిస్తోంది: 11 రోజుల ప్లాన్ లో ప్రీమియం రూ.11 గా ఉంటుంది. ఈ పాలసీ తీసుకున్న నాటి నుంచి 11 రోజుల పాటు కవరేజీ వర్తిస్తుంది. పండుగ రోజుల్లో మాత్రమే బాణసంచా కాల్చేవారికి ఇది అనుకూలంగా ఉంటుంది. 30 రోజుల విస్తృత ప్లాన్ లో ప్రీమియం రూ.21 గా నిర్ణయించారు. దీపావళి సీజన్ మొత్తం టపాసులు పేల్చేవారికి ఇది ఎంతో మేలు చేస్తుంది. ఈ ప్లాన్ ద్వారా నెల రోజుల పాటు కవరేజీ లభిస్తుంది. ఈ రెండు ప్లాన్లలోనూ గరిష్టంగా రూ.25,000 వరకు వైద్య చికిత్స ఖర్చుల పరిమితి ఉంటుంది.
ఫోన్‌పే ఫైర్ క్రాకర్స్ ఇన్సూరెన్స్ : రూ.11 నామమాత్రపు ప్రీమియంతో ఇన్సూరెన్స్ కవరేజీ
byTelugu Lo Computer
•
•
2 min read
