తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు ఏరియల్ వ్యూ

తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు నాయుడుఏరియల్ వ్యూ చేశారు. అర్నబ్ తుఫాను వల్ల నష్టపోయిన పంటల నష్టాన్ని పరిశీలించారు. అమరావతి నుంచి చెయ్యేరువరకు వెళ్లే మార్గంలో హెలికాప్టర్‌లో నుంచి అరటి, కొబ్బరి తోటలు, ఆక్వా చెరువులను ఆయన పరిశీలిస్తున్నారు. సీఎం చంద్రబాబుతో పాటు అధికారులు వ్యూ చేస్తున్నారు. తుఫాన్ నష్టాన్ని సీఎంకు వివరిస్తున్నారు. కృష్ణా జిల్లాతో పాటు పశ్చిమ గోదావరి, కోనసీమ ప్రాంతాల్లో సీఎం ఏరియల్ వ్యూ చేస్తున్నారు. తుఫాన్ నష్టాన్ని స్వయంగా పరిశీలిస్తున్నారు. తుపానుతో నష్టపోయిన రైతులకు భరోసా ఇచ్చేందుకు సీఎం క్షేత్ర స్థాయి పరిశీలన చేస్తున్నారు. దాదాపుగా 2 లక్షలకు పైగా పంట పొలాలు దెబ్బతిన్నట్లు ఇప్పటికే అంచనా వేశారు. 10 వేల ఎకరాల్లో ఉద్యానవన పంటలు ధ్వంసం అయినట్లు సీఎం చంద్రబాబుకు అధికారులు వివరించారు. చాలా గ్రామాలు, నివాస గృహాలు పంట పొలాలు నీటమునిగి ఉండటాన్ని సీఎం చంద్రబాబు నాయుడు ఏరియల్ వ్యూ ద్వారా గమనించారు. నిమ్మకూరు, పామర్రు, బంటుమిల్లి, నర్సాపురం, పాలకొల్లు, అమలాపురం రూట్లో సీఎం చంద్రబాబు ఏరియల్ వ్యూ చేస్తున్నారు.

Post a Comment

Previous Post Next Post
3