తెలంగాణలో తొమ్మిది మంది ఐఏఎస్ అధికారులను స్థానచలనం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం చేపట్టిన బదిలీల్లో భాగంగా జయేశ్ రంజన్‌కు అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బాధ్యతలు అప్పగించింది. నవీన్ మిట్టల్‌ను పంచాయతీరాజ్ శాఖకు బదిలీ చేసింది. శైలజా రామయ్యర్‌కు దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా బాధ్యతలు అప్పగించింది. వికాస్ రాజ్‌ను విద్యుత్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించింది. వాణి ప్రసాద్‌కు యువజన సర్వీసుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బాధ్యతలు కేటాయించింది. రాహుల్ బొజ్జకు గిరిజన సంక్షేమ శాఖ అదనపు బాధ్యతలు అప్పగించింది. ఇలాంబర్తిని రవాణా శాఖ కార్యదర్శిగా నియమించగా, సర్ఫరాజ్ అహ్మద్‌కు మెట్రోపాలిటన్, హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ పరిధిలో కార్యదర్శి బాధ్యతలు అప్పగించింది.
