విజయవంతమైన జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్18 ప్రయోగం : ఇస్రో శాస్త్రవేత్తలు, ఇంజనీర్లకు 'X' వేదికగా శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ప్రయోగించిన జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్18 విజయవంతంగా ఆకాశంలోకి దూసుకుళ్లింది. జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్18 రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించినందుకు ప్రధాని నరేంద్ర మోడీ ఇస్రో శాస్త్రవేత్తలు, ఇంజనీర్లకు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'X' వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. 'NVS-03 ఉపగ్రహాన్ని మోసుకెళ్తున్న జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్18ను విజయవంతంగా ప్రయోగించిన ఇస్రో శాస్త్రవేత్తలు, ఇంజనీర్లకు నా హృదయపూర్వక అభినందనలు. మన దేశీయ నావిగేషన్ వ్యవస్థ నావిక్ ని మరింత బలోపేతం చేయడంలో ఈ ప్రయోగం అత్యంత కీలకమైన అడుగు. మరిన్ని మెరుగైన సామర్థ్యాలతో పనిచేసే NVS-03 ఉపగ్రహం, కీలకమైన సాంకేతిక పరిజ్ఞానంలో మన దేశ స్వయంసమృద్ధి సాధనను మరింత ముందుకు తీసుకెళ్తుంది. అంతేకాకుండా మన ప్రజలకు ఉపయోగపడే నావిగేషన్ సేవలకు ఎంతగానో తోడ్పడుతుంది. మన అంతరిక్ష శాస్త్రవేత్తల అంకితభావం, నైపుణ్యం, సృజనాత్మకత నిరంతరం మన రంగాన్ని, దేశాన్ని గర్వపడేలా చేస్తున్నాయి' అని ప్రధాని నరేంద్ర మోడీ కొనియాడారు.

Post a Comment

Previous Post Next Post
3