భారత టెలికాం రంగంలో హవా కొనసాగిస్తున్న జియో : సెప్టెంబర్‌లో 22 లక్షల మంది కొత్త మొబైల్ వినియోగదారులు చేరిక

టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా విడుదల చేసిన సెప్టెంబర్ నెల గణాంకాలు ప్రకారం జియో కొత్త కస్టమర్లను ఆకర్షించడంలో మాత్రమే కాకుండా యాక్టివ్ యూజర్లను పెంచుకోవడంలోనూ మిగతా టెలికాం కంపెనీల కంటే ముందుంది. మెషిన్-టు-మెషిన్ కనెక్షన్లను మినహాయిస్తే, సెప్టెంబర్‌లో దేశవ్యాప్తంగా 22 లక్షల మంది కొత్త మొబైల్ వినియోగదారులు చేరారు. ఇందులో జియో ఒక్కటే 19 లక్షల మందిని తన నెట్‌వర్క్‌లోకి చేర్చుకుంది. అదే సమయంలో ఎయిర్‌టెల్‌కు కేవలం 2 లక్షల మంది కొత్త కస్టమర్లు మాత్రమే వచ్చినట్లు తెలుస్తోంది. కొత్త వినియోగదారులను సంపాదించడంలో జియో, ఎయిర్‌టెల్ కంటే దాదాపు పది రెట్లు ముందుంది. సెప్టెంబర్ చివరి నాటికి జియోకు 51.114 కోట్ల మంది సబ్‌స్క్రైబర్లు ఉండగా, ఎయిర్‌టెల్‌కు 49.429 కోట్ల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. మరోవైపు ఎయిర్‌టెల్ కొత్త కస్టమర్లను ఆకర్షించడంలో వెనుకబడటానికి దాని రూ.299 ప్రీపెయిడ్ ప్లాన్ నిలిపివేయడం కూడా ఒక కారణమని చెబుతున్నారు. ఆగస్టులో ఎయిర్‌టెల్ రూ.299 ప్లాన్‌ను తొలగించడంతో.. తక్కువ ధరలో రీఛార్జ్ కోరుకునే వినియోగదారులపై ప్రభావం పడినట్లు చెబుతున్నారు. సెప్టెంబర్‌లో ఎయిర్‌టెల్ మొత్తం 26.9 లక్షల వైర్‌లెస్ కనెక్షన్లను జోడించినప్పటికీ, సాధారణ మొబైల్ వినియోగదారుల సంఖ్య మాత్రం కేవలం 2 లక్షలే పెరిగింది. మిగిలిన కనెక్షన్లలో M2M కనెక్షన్ల వాటా ఎక్కువగా ఉండవచ్చని విశ్లేషకుల అంచనా. యాక్టివ్ యూజర్ల విషయంలోనూ జియో తన సత్తా చాటింది.

Post a Comment

Previous Post Next Post
3