మరోసారి తన సైనిక శక్తిని ప్రదర్శించిన ఉత్తర కొరియా

ఉత్తర కొరియా అత్యాధునిక సాంకేతికత, కృత్రిమ మేధ ఆధారంగా రూపొందించిన ఆయుధాలను ప్రపంచానికి పరిచయం చేసింది. ఇందులో భాగంగా 600 మి.మీ. సామర్థ్యం కలిగిన 'స్నైపర్' మల్టిపుల్ రాకెట్ లాంచర్‌ను తొలిసారిగా ఆవిష్కరించి, ప్రత్యక్షంగా పరీక్షించింది. ఈ కార్యక్రమాన్ని అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ స్వయంగా పర్యవేక్షించారు. ఈ రాకెట్ లాంచర్ అత్యంత కచ్చితత్వంతో లక్ష్యాలను ఛేదించగలదని ఉత్తర కొరియా మీడియా పేర్కొంది. అంతేకాదు ఈ ప్రదర్శనలో ఒకేసారి పది కంటే ఎక్కువ లాంచర్లతో కాల్పులు జరిపారు. డ్రోన్ల ద్వారా క్షిపణులను ప్రయోగించారు. వాటితో పాటు ఆత్మాహుతి డ్రోన్ల దాడులను కూడా ప్రదర్శించారు.

Post a Comment

Previous Post Next Post
3