అమెరికాలో అత్యంత ఘనంగా జరుపుకునే 'థాంక్స్ గివింగ్' వేడుకల వేళ పెను తుఫాన్ బీభత్సం సృష్టించింది. భారీ వర్షాలు, వరదలు, బలమైన ఈదురుగాలుల ధాటికి దేశంలోని పలు రాష్ట్రాల్లో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. ముఖ్యంగా వర్జీనియా, మేరీల్యాండ్, పెన్సిల్వేనియా, మిస్సౌరీ, న్యూజెర్సీ, డెలావేర్, నార్త్ కరోలినా రాష్ట్రాల్లో తుఫాన్ ప్రభావం తీవ్రంగా ఉంది. ఈదురుగాలులకు విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకొరగడంతో ఏకంగా 8,36,000కు పైగా ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయి ప్రజలు చీకట్లో మగ్గిపోతున్నారు. మరోవైపు, పండుగ సెలవుల నేపథ్యంలో ప్రయాణాలకు సిద్ధమైన వారికి తీవ్ర నిరాశ ఎదురైంది; ప్రతికూల వాతావరణం కారణంగా సుమారు 1,800 విమానాలు ఆలస్యంగా నడుస్తుండగా, 417 విమానాలను అధికారులు పూర్తిగా రద్దు చేశారు. పంటలు చేతికి వచ్చిన ఆనందంలోనూ, ఏడాది పొడవునా తమకు జరిగిన మేలుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ అమెరికన్లు ఏటా ‘థాంక్స్ గివింగ్’ పండుగను కుటుంబ సభ్యులతో కలిసి ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. అయితే, సరిగ్గా పండుగ సమయంలోనే తుఫాన్ విరుచుకుపడటంతో ప్రయాణాలు నిలిచిపోయి ఎక్కడివారక్కడే చిక్కుకుపోయారు. వరద నీరు నివాస ప్రాంతాల్లోకి చేరడంతో సహాయక బృందాలు రంగంలోకి దిగి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి. విద్యుత్ పునరుద్ధరణ పనులు యుద్ధప్రాతిపదికన కొనసాగుతున్నప్పటికీ, వాతావరణం అనుకూలించకపోవడంతో మరికొన్ని గంటల పాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
3
Beranda › Posts filed under 000 homes and leaving residents in the dark
Showing posts with label 000 homes and leaving residents in the dark. Show all posts
Showing posts with label 000 homes and leaving residents in the dark. Show all posts
Subscribe to:
Posts (Atom)
