3

ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో నిలిపి ఉంచిన అంబులెన్స్‌లో పేలిన ఆక్సిజన్ సిలిండర్ : నవజాత శిశువుతో సహా 10 మంది దుర్మరణం

పాకిస్థాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌లో థార్‌పార్కర్ జిల్లాలోని ఒక ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో నిలిపి ఉంచిన అంబులెన్స్‌లో ఉన్న ఆక్సిజన్ సిలిండర్ ఒక్కసారిగా పేలింది. ఈ దారుణ ప్రమాదంలో నవజాత శిశువుతో సహా మొత్తం పది మంది అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. పేలుడు ధాటికి అంబులెన్స్ తీవ్రంగా ధ్వంసమవ్వడమే కాకుండా ఆసుపత్రి ప్రాంగణంలో భయాందోళనలు వ్యక్తమయ్యాయి. ఈ విషాదకర ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారిలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఉన్నారు. వీరిలో ముగ్గురు మహిళలు మరియు ఒక నవజాత శిశువు ఉన్నట్లు అధికారులు తెలిపారు. వీరితో పాటు ఆసుపత్రికి చెందిన సిబ్బంది మరియు అక్కడ ఉన్న కొందరు స్థానికులు కూడా ఈ ప్రమాదానికి బలియ్యారు. ప్రమాదంలో మరో నలుగురు తీవ్రంగా గాయపడగా, వారిని వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. 

Related Post

Previous
Next Post »