యాపిల్‌ సంస్థలో ఇంజినీరింగ్ విభాగానికి వైస్ ప్రెసిడెంట్‌గా రాజేష్ అంబటికి పదోన్నతి

యాపిల్‌ సంస్థలో ఇంజినీరింగ్ విభాగానికి రాజేష్ అంబటి వైస్ ప్రెసిడెంట్‌గా నియమితులయ్యారు. దాదాపు 18 ఏళ్లుగా యాపిల్‌లో పనిచేస్తున్న ఆయన, తన అనుభవం, నైపుణ్యంతో ఈ స్థాయికి ఎదిగారు. యాపిల్ కంపెనీలో చేపట్టిన నాయకత్వ మార్పుల్లో భాగంగా రాజేష్ అంబటితో పాటు లూయీ సాంగునెట్టి, డెరెక్ షేఫర్ కూడా వైస్ ప్రెసిడెంట్లుగా పదోన్నతి పొందారు. ఈయన తన కెరీర్‌లో ఎక్కువ భాగం సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్ అండ్ వైర్‌లెస్ కనెక్టివిటీపై పనిచేశారు. పదోన్నతి పొందక ముందు, సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్ సీనియర్ డైరెక్టర్‌గా ఉంటూ.. కంపెనీ కనెక్టివిటీ, సెల్యులార్, శాటిలైట్ సాఫ్ట్‌వేర్‌కు బాధ్యత వహించారు. సాఫ్ట్‌వేర్ పనితీరును పరిశీలించడం, టెస్టులు నిర్వహించడం, నాణ్యతను నిర్ధారించడం, సమస్యలను గుర్తించి పరిష్కరించడం వంటి కీలక పనుల్లో కూడా ఆయనకు అనుభవం ఉంది. ఈ అనుభవమే సంస్థలో ఉన్నత స్థాయికి ఎదగడానికి తోడ్పడింది. రాజేష్ అంబటి తన కెరీర్‌ను మోటరోలా సంస్థలో ప్రారంభించారు. 2003 జనవరి నుంచి 2009 నవంబర్ వరకు అక్కడ ఇంజినీరింగ్ మేనేజర్‌గా పనిచేశారు. ఆ తర్వాత 2009 అక్టోబర్‌లో యాపిల్‌లో సీనియర్ సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ మేనేజర్‌గా చేరారు. అప్పటి నుంచి వివిధ బాధ్యతలు చేపడుతూ క్రమంగా తన కెరీర్‌లో ఎదిగారు.

Post a Comment

Previous Post Next Post
3