హైదరాబాద్‌కు నవంబర్ 2న అమిత్ షా రాక

నవంబర్ 2న  హైదరాబాద్ కు అమిత్ షా వస్తున్నారు. అమిత్ షా పర్యటనకు సంబంధించి అధికారిక షెడ్యూల్ ఖరారైంది. మధ్యాహ్నం 2 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకోనున్న అమిత్ షా, బేగంపేట నుంచి కాకతీయ హోటల్ చేరుకొని 4 గంటల వరకు కాకతీయ హోటల్ లో బస చేయనున్నారు. సాయంత్రం 4 తర్వాత నేరుగా బాబు జగ్జీవన్ రాం విగ్రహం నుంచి ఎంజే మార్కెట్ వరకు "లోక్ తంత్ర బచావో - అరాచకత్వ హటావో " పేరుతో తలపెట్టిన పాదయాత్రలో పాల్గొననున్నారు. సాయంత్రం  5 గంటల నుంచి 5.30 వరకు ఎంజే మార్కెట్ వద్ద ప్రజలనుద్దేశించి మాట్లాడి అనంతరం 6గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి ఢిల్లీకి బయల్దేరతారు.

Post a Comment

Previous Post Next Post
3