తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం సోలక్‌పల్లి గ్రామంలో పొలంలో పనిచేస్తున్న మహిళ మెడలోని పుస్తెలతాడును లాక్కునేందుకు ప్రయత్నించిన ఇద్దరు దొంగలకు ఓ మహిళ చితక్కొట్టింది. స్థానిక రైతుల సాయంతో వారిని పట్టుకుని పోలీసులకు అప్పగించింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‍గా మారింది. కిష్టమ్మ అనే మహిళా రైతు ఇవాళ పొలంలో పనిచేస్తోంది. ఈ క్రమంలో అక్కడికి వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఆమె మెడలోని పుస్తెలతాడును లాక్కునేందుకు ప్రయత్నించారు. దీంతో అప్రమత్తమైన కిష్టమ్మ గట్టిగా కేకలు వేసింది. ఆమె అరుపులు విన్న సమీప పొలాల్లో పనిచేస్తున్న రైతులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. స్థానికులు దొంగలను పట్టుకున్న తర్వాత కిష్టమ్మ ధైర్యంతో ముందుకు వచ్చి చేతికి దొరికిన కర్రతో ఆ ఇద్దరు దొంగలను చితక్కొట్టింది. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఆపద సమయంలో భయపడకుండా దొంగలను ఎదిరించి బుద్ధి చెప్పిన కిష్టమ్మ ధైర్యసాహసాలను చూసి నెటిజన్లు శభాష్ కిష్టమ్మ అంటూ ప్రశంసిస్తున్నారు. కాగా సమాచారం అందుకున్న జిన్నారం పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని నిందితులను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితులను హత్నూర మండలం ముచ్చర్లకు చెందిన వడ్డే సాయిలు, మీనంపల్లికి చెందిన అరవింద్‌గా గుర్తించినట్లు జిన్నారం సీఐ నాగార్జున రెడ్డి తెలిపారు. వీరిద్దరిపై గతంలో కూడా పలు చోరీ కేసులు ఉన్నాయని, పాత నేరస్థులని వెల్లడించారు. ఇద్దరిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశామని, అనంతరం రిమాండ్‌కు తరలించినట్లు సీఐ స్పష్టం చేశారు.
3
Beranda
› hands them over to the police
› Jinnaram Mandal
› Sangareddy
› Solakpalli
› telangana
› the woman
› Thieves attempt to snatch a pustelatadu from a woman working in a field
› with the help of local farmers
› పొలంలో పనిచేస్తున్న మహిళ మెడలో పుస్తెలతాడు లాక్కునేందుకు ప్రయత్నించిన దొంగలు : రైతుల సాయంతో పట్టుకుని పోలీసులకు అప్పగించిన మహిళ
Subscribe to:
Post Comments (Atom)
