తెలంగాణలోని కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలం లంబాడిగూడ గ్రామ పంచాయతీ పరిధిలోని బోగడగూడ మేరీమాత ఇంగ్లీష్ మీడియం పాఠశాల వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మార్తిడి గ్రామానికి చెందిన గోమాస్ రవీందర్ తన పిల్లలను స్కూటర్‌పై పాఠశాలకు తీసుకువస్తుండగా ప్రమాదం జరిగింది. సలుగుపల్లి వైపు నుంచి వేగంగా వస్తున్న బొలెరో వాహనం స్కూటర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రవీందర్ కాలికి తీవ్ర గాయాలై, తీవ్ర రక్తస్రావం అయింది. వెంటనే స్థానికులు స్పందించి ఆర్ఎంపీ వైద్యుడి వద్ద ప్రథమ చికిత్స అందించారు. పిల్లలు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
