తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం వెల్మల్ గ్రామంలో అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు తనకు తెలియకుండా ప్రేమ వివాహం చేసుకోవడాన్ని అవమానంగా భావించిన తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనపై పోలీసులు, స్థాని కులు తెలిపిన వివరాల మేరకు వెల్మల్ గ్రామానికి చెందిన బండకాడి రాజన్న (50)కు నలుగురు కూతుళ్లు. ముగ్గురికి వివాహమైంది. చిన్నకూతురు (19) ట్రిపుల్ ఐటీలో చదువుతోంది. ఆమె గ్రామానికి చెందిన యువ కుడిని ప్రేమించింది. ఒకే సామాజిక వర్గానికి చెందిన వారిద్దరు పారిపోయి బుధవారం పెళ్లి చేసుకున్నారు. అయితే కూతురు ప్రేమ వివాహం చేసుకోవడంతో పరువు పోయిందని మనస్తాపానికి గురైన రాజన్న.. గ్రామ శివారులోని పొలంలో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య బండకాడి లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నామని ఎస్సై వినయ్ తెలిపారు.
తనకు తెలియకుండా కూతురు ప్రేమ వివాహం చేసుకోవడాన్ని అవమానంగా భావించి ఆత్మహత్య చేసుకున్న తండ్రి
byTelugu Lo Computer
•
•
2 min read
