ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

జీఎస్‌ఎల్వీ-ఎఫ్-18 రాకెట్ ద్వారా ఎన్‌ఎస్‌వీ-03 నావిగేషన్ ఉపగ్రహాన్ని ఇస్రో విజయవంతంగా ప్రయోగించిన సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఇస్రో శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు, సిబ్బందికి అభినందనలు తెలిపారు. ఉపగ్రహాన్ని నిర్దేశిత భూస్థిర కక్ష్యలోకి ప్రవేశపెట్టడం భారత నావిగేషన్ సామర్థ్యాలను మరింత బలోపేతం చేసే కీలక మైలురాయి అని ప్రశంసించారు. రవాణా, విమానయానం, సముద్ర నావిగేషన్, పర్యవేక్షణ, అత్యవసర సేవల వంటి కీలక రంగాల్లో ఎన్‌ఎస్‌వి-03 మెరుగైన సేవలు అందించనుందని పేర్కొన్నారు. ఈ విజయం యావత్ దేశానికి గర్వకారణమని, భవిష్యత్తులో ఇస్రో మరిన్ని విజయాలు సాధించాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.

Post a Comment

Previous Post Next Post
3