అండమాన్ నికోబార్ దీవులలో గురువారం భూకంపం సంభవించింది. ఈ భూకంపం రిక్టర్ స్కేల్‌పై 5.1 తీవ్రతతో నమోదైనట్లు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే అధికారికంగా వెల్లడించింది. అందిన సమాచారం ప్రకారం, ఈ భూకంప కేంద్రం బాంబూ ఫ్లాట్ ప్రాంతానికి సుమారు 218 కిలోమీటర్ల దూరంలో ఉత్తర-వాయువ్య దిశలో కేంద్రీకృతమై ఉంది. భూ అంతర్భాగంలో కేవలం 10 కిలోమీటర్ల లోతులోనే ఈ భూకంప కేంద్రం ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. లోతు తక్కువగా ఉండటంతో ప్రకంపనల ప్రభావం స్పష్టంగా కనిపిచింది. ఈ భూకంప ఘటన కారణంగా ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ నష్టం గానీ, ఆస్తి నష్టం గానీ జరిగినట్లు ఎటువంటి అధికారిక సమాచారం రాలేదు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకపోవడంతో అధికారులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. భూకంపం సంభవించిన నేపథ్యంలో స్థానిక యంత్రాంగం మరియు విపత్తు నిర్వహణ బృందాలు వెంటనే అప్రమత్తమయ్యాయి. ఎటువంటి అత్యవసర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు వీలుగా అధికారులు పరిస్థితిని ఎప్పკటికప్పుడు నిశితంగా పర్యవేక్షిస్తున్నారు.
