కేరళ రాజధాని తిరువనంతపురంలో బుధవారం మీడియాతో మాట్లాడిన శశి థరూర్‌ను.. ఢిల్లీలో నిరసనలు జరుగుతున్న సమయంలో రాహుల్ గాంధీ విదేశాలకు ఎందుకు వెళ్లారంటూ విలేకరులు ప్రశ్నించారు. దీనిపై ఆయన స్పందిస్తూ “నేను ట్రావెల్ ఏజెంట్‌ను కాదు. ఆ ప్రశ్న నన్ను అడగడంలో అర్థం లేదు. నేను ఇప్పుడు ఢిల్లీ నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చాను? ప్రతి ఒక్కరికీ కొన్ని వ్యక్తిగత బాధ్యతలు, ప్రణాళికలు ఉంటాయి. కాబట్టి ఈ అంశంపై నేను ఎలాంటి వ్యాఖ్య చేయలేను” అని తేల్చి చెప్పారు. రాహుల్ గాంధీ విదేశీ పర్యటనపై విపక్షాలు, బీజేపీ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించాయి. ఎన్నికల కమిషన్‌పై కాంగ్రెస్ లేనిపోని ఆరోపణలు చేసి, ఆపై రాహుల్ గాంధీ విశ్రాంతి కోసం విదేశాలకు వెళ్లిపోయారంటూ ఆరోపించాయి. విమానంలోని బిజినెస్ క్లాస్ క్యాబిన్‌లో రాహుల్ గాంధీ కూర్చున్న వీడియోను బీజేపీ తమ అధికారిక సోషల్ మీడియా ‘ఎక్స్’ (ట్విటర్) ఖాతాలో షేర్ చేస్తూ “అబద్ధాలు చెప్పి అలసిపోయాను.. కొద్దిరోజులు వియత్నాంలో విహరించి వస్తాను” అని వ్యంగ్యంగా క్యాప్షన్ జోడించింది. అలాగే బీజేపీ అధికార ప్రతినిధులు స్పందిస్తూ రాజకీయ కార్యక్రమాలు, ఆందోళనల తర్వాత రాహుల్ గాంధీ విదేశీ విహారయాత్రలకు వెళ్లడం అలవాటుగా మారిందని, ఆయన నిబద్ధత ఇదేనా అని ప్రశ్నించారు. కాగా పండుగల సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని ఇండియా కూటమి ప్రతిపక్షాలు తమ నిరసన కార్యక్రమాలను తాత్కాలికంగా వాయిదా వేశాయి. అయితే, ఢిల్లీలో కీలక ఆందోళనల నడుమ రాహుల్ గాంధీ విదేశీ పర్యటన చేపట్టడం వల్ల ఈ అంశం చుట్టూ దేశ రాజకీయాల్లో ముమ్మర చర్చ సాగుతోంది.
రాహుల్ గాంధీ విదేశాలకు ఎందుకు వెళ్లారంటూ శశి థరూర్‌ను ప్రశ్నించిన విలేకరులు : నేనేమి ట్రావెల్ ఏజెంట్‌ను కాదన్న ఎంపీ
by Telugu Lo Computer at October 21, 2026
Labels:
"I am not a travel agent."
,
kerala
,
national
,
Reporters asked Shashi Tharoor why Rahul Gandhi went abroad
,
the MP replied
,
Thiruvananthapuram
About Telugu Lo Computer
This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
Related Posts
Subscribe to:
Post Comments
(
Atom
)
3



No comments:
Post a Comment