Tuesday, October 20, 2026

సముద్రంలో స్నానం చేస్తూ నలుగురు గల్లంతు : రెండు మృతదేహాలు వెలికితీత

ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లా పెద్దగనగళ్లవానిపేట బీచ్‌లో స్నానానికి వెళ్లి నలుగురు వ్యక్తులు గల్లంతయ్యారు. వీరిలో ఇద్దరి మృతదేహాలను రెస్క్యూ టీమ్ బయటకు తీశారు. మిగిలిన ఇద్దరి కోసం గాలిస్తున్నారు. మృతులు విజయనగరం జిల్లాకు చెందిన పావని, మాధవిగా గుర్తించారు. సముద్రంలో స్నానం చేస్తున్న సమయంలో పెద్ద అల వచ్చింది. దీంతో నీటిలో గల్లంతయ్యారు. అందరూ చూస్తుండగా నలుగురు కూడా కొట్టుకుపోయారు. అక్కడే ఉన్న రెస్క్యూ సిబ్బంది కాపాడే ప్రయత్నం చేసింది. అయితే అప్పటికే సముద్రపు నీటిలో ఊపిరాడక పావని, మాధవి మృతి చెందారు. ప్రస్తుతం వీరి మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు