హైదరాబాద్ లోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సచివాలయంలో రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. భూభారతి చట్టం అమలు, రైతులకు పట్టాదారు పాస్‌బుక్కుల పంపిణీ, రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన భూముల రీ-సర్వే, భూ సమస్యల పరిష్కారం, ఇటీవల తీసుకున్న కీలక నిర్ణయాల అమలు తీరును సుదీర్ఘంగా సమీక్షించారు. ప్రజలకు రెవెన్యూ సేవలు మరింత పారదర్శకంగా, వేగంగా అందేలా అధికారులు క్షేత్రస్థాయిలో మరింత బాగా పనిచేయాలని ఆదేశించారు. ప్రజలు కోరిన భూవివాదాలు లేని తెలంగాణ ఉండాలన్న సంకల్పంతో చారిత్రాత్మకమైన భూభారతి చట్టాన్ని తీసుకువచ్చామని ఈ చట్టం అమలులోకి వచ్చిన ఏప్రిల్ 14, 2025 నుంచి ఇప్పటి వరకు 5,68,858 పాస్ బుక్కులు జారీ చేశామని అలాగే ఈ చట్టానికి ముందు 6,71,508 మొత్తం ఈ 34 నెలల్లో 12,40,366 పాస్ బుక్ లను రైతులకు అందజేశామన్నారు. దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలకు భూభారతి చట్టంలో పేర్కొన్న విధంగా రీ-సర్వే ద్వారా పరిష్కారం చూపుతున్నామన్నారు. కొన్ని దశాబ్దాలుగా భూమిని సాగు చేస్తున్నా రికార్డుల్లో హక్కులు లేక ప్రభుత్వ సంక్షేమ పధకాలకు దూరమై ఇబ్బందులు పడుతున్న రైతులకు తమ ప్రభుత్వం అండగా నిలిచి సమగ్ర సర్వే నిర్వహించి వాస్తవ సాగుదారులను గుర్తించి వారికి చట్టబద్దమైన హక్కులు కల్పిస్తున్నామన్నారు. ఇప్పటికే మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం, నారాయణపురం రెవెన్యూ గ్రామంలో రీ-సర్వే నిర్వహించి గిరిజనులు, గిరిజనేతరుల సమస్యను పరిష్కరించి 906 మంది రైతులకు 1,600 ఎకరాలకుపైగా హక్కులు కల్పించామన్నారు. సూర్యాపేట జిల్లా నూతనకల్, మద్దిరాల మండలాలలో 15 గ్రామాలల్లో రీ-సర్వే ద్వారా 2,400 మంది రైతులకు 3,450ఎకరాలకు పట్టాలు ఇవ్వడం జరిగిందన్నారు. దీంతో పట్టాదారు పాస్‌బుక్‌లతో రైతులకు బ్యాంకు రుణాలు, రైతు భరోసా, ఇతర ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందే అవకాశం లభించిందన్నారు. అలాగే ములుగు జిల్లా ముల్కపల్లి మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచ, అశ్వరావుపేట, దమ్మపేట, ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలాల్లో ఈ రీసర్వే పనులు వేగవంతంగా జరుగుతున్నాయని ఆయా ప్రాంతాల్లో దశాబ్దాలుగుఆ కొనసాగుతున్న సమస్యకు పరిష్కరించి త్వరలోనే హక్కుదారులకు పాస్‌బుక్కులు అందిస్తామన్నారు. ఇదే పద్దతిలో ఇతర ప్రాంతాల్లో కూడా సర్వే నిర్వహించి దశాబ్దాలుగా భూమిపై హక్కుల కోసం ఎదురు చూస్తున్న ప్రజలకు హక్కులు కల్పించే విధంగా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రజాకోణంలో రెవెన్యూ శాఖలో ప్రభుత్వం తీసుకుంటున్న విధాన పరమైన నిర్ణయాలు, ఉత్తర్వులు క్షేత్రస్థాయిలో పకడ్బందీగా అమలు జరిగినప్పుడే ప్రజలకు మేలు జరుగుతుందని దీనిని దృష్టిలో పెట్టుకొని పనిచేయాలని అన్నారు. జనగామ జిల్లాలో ఫుడ్ పార్క్ ఏర్పాటుపై ఆ జిల్లా కలెక్టర్‌తో చర్చించారు.ఈ సమావేశంలో రెవెన్యూ శాఖ సెక్రటరీ డి.ఎస్.లోకేష్ కుమార్, స్టాంప్స్ & రిజిస్ట్రేషన్ ఐజి రాజీవ్ గాంధీ హనుమంతు జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తదితరులు పాల్గొన్నారు.
Home
Officials must work more effectively at the field level to ensure that revenue services are delivered transparently and expeditiously Minister Ponguleti at a Revenue Department review meeting.
రెవెన్యూ సేవలు పారదర్శకంగా, వేగంగా అందేలా అధికారులు క్షేత్రస్థాయిలో మరింత బాగా పనిచేయాలి : రెవెన్యూ శాఖ సమీక్ష సమావేశంలో మంత్రి పొంగులేటి
Subscribe to:
Post Comments (Atom)
Follow by Email
If you like Articles on this blog, Please subscribe for free via email.
Liên Kết Bạn Bè
Bình Luận Mới Nhất
Trending
Archive
Updates
Wikipedia
Search results
Comments
Recent
Fashion
News
Food
Sports
Tech News $ Scince latest
Food
Technology
Menu Footer Widget
Featured
Videos
Ticker
6/recent/ticker-posts
Comment
Ad Code
THỐNG KÊ BLOGSPOT
Configure Archive
Search This Blog
Advertisement
Masukkan script iklan 300x600px
Menu Atas
About
Ad Space
Business
Recent Post
About Me
NGƯỜI THEO DÕI BLOG
Topik Populer
Translate
Travel the world
Berita Terbaru
Pages
Pages
স্বাগতম! অনলাইনে ইনকাম, ফ্রিল্যান্সিং, এসইও এবং ডিজিটাল মার্কেটিং এর সকল তথ্য পেতে যুক্ত থাকুন টেক বাংলা ইনফো-এর সাথেই থাকুন।

