Monday, October 19, 2026

అక్టోబర్ 24న ఆరు భాషలలో విడుదల కానున్న 'జయహో రామానుజ'

ఆధ్యాత్మిక తత్వవేత్త, సామాజిక సంస్కర్త రామానుజాచార్యుల జీవిత కథతో రూపొందిన చిత్రం 'జయహో రామానుజ'. లయన్ డా. సాయి వెంకట్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సుదర్శనం ప్రొడక్షన్స్‌పై సాయిప్రసన్న, ప్రవళ్లిక నిర్మిస్తున్నారు. అమెరికా నటి జో శర్మ కథానాయికగా నటిస్తుండగా, సుమన్, ప్రవళ్లిక ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. అక్టోబర్ 24న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, సంస్కృత భాషల్లో ఈ సినిమాని విడుదల చేయాలని చిత్రబృందం సిద్ధమవుతోంది.