కేరళ మాజీ సీఎం, ప్రతిపక్ష నాయకుడు పినరయి విజయన్, ఆయన కుమార్తె వీణ, అల్లుడు పీఏ మహమ్మద్ రియాస్‌లకు సుప్రీంకోర్టులో ఇవాళ భారీ ఊరట లభించింది. సీఎంఆర్‌ఎల్-ఎక్సాలాజిక్ రూ.278 కోట్ల పే-ఆఫ్ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు 7 రోజుల పాటు వారికి తాత్కాలిక రక్షణ కల్పించింది. కేసులో ఇరు పక్షాల వాదనలు విన్న జస్టిస్ జాయ్‌మాల్య బాగ్చి, జస్టిస్ వి.మోహనలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం కేరళ హైకోర్టు డివిజన్ బెంచ్ అక్టోబర్ 15 నాటి ఉత్తర్వులను రద్దు చేసింది. ఎఫ్‌ఐఆర్‌ను సవాల్ చేసే హక్కును పిటిషనర్‌లకు హైకోర్టు నిరాకరించడాన్ని తప్పుబట్టింది. అంనంతరం ఎఫ్‌ఐఆర్‌పై విచారణను 7 రోజుల పాటు నిలిపివేస్త కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, ఎఫ్‌ఐఆర్ యథావిధిగా కొనసాగుతుందని, తదుపరి మధ్యంతర రక్షణపై స్వతంత్రంగా నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ కేరళ హైకోర్టుకు ఉంటుందని స్పష్టం చేసింది. ఎఫ్‌ఐఆర్ నమోదు చేసే విషయంలో ప్రాథమిక విచారణ ఇంకా జరగలేదని, అలాగే అవినీతి నిరోధక చట్టం కింద అవసరమైన అనుమతులు తీసుకోకపోవడాన్ని సుప్రీం ధర్మాసనం ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
సీఎంఆర్‌ఎల్-ఎక్సాలాజిక్ రూ.278 కోట్ల పే-ఆఫ్ కేసు :కేరళ హైకోర్టు డివిజన్ బెంచ్ ఉత్తర్వులను రద్దు చేసిన సుప్రీంకోర్టు
by Telugu Lo Computer at October 21, 2026
Labels:
CMRL-Exalogic Rs 278 Crore Pay-off Case
,
Court granted them interim protection for seven days
,
P.A. Mohamed Riyas
,
Pinarayi Vijayan
,
Supreme Court Sets Aside Kerala High Court Division Bench Order
,
Veena
About Telugu Lo Computer
This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
Related Posts
Subscribe to:
Post Comments
(
Atom
)
3



No comments:
Post a Comment