Monday, October 19, 2026

పాతబస్తీలోని బాంబే హోజరీలో భారీ అగ్నిప్రమాదం

తెలంగాణ హైకోర్టు సమీపంలోని మదీనా వద్ద ఉన్న 'బాంబే హోజరీ'లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈరోజు తెల్లవారుజామున, హైకోర్టుకు ఎదురుగా ఉన్న మదీనా క్రాస్ రోడ్ వద్ద గల 'బాంబే హోజరీ' వస్త్ర దుకాణం మరియు గోదాములో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక వాహనాలు మరియు చార్మినార్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పుతున్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.