మక్కాలోని ఓ మసీదులో 'అనైతిక చర్యలకు' పాల్పడ్డారనే ఆరోపణలపై ఒక జంటను అక్టోబర్ 14న మరణశిక్ష విధించినట్లు సౌదీ అరేబియా మీడియా వెల్లడించింది. ఇద్దరు బంగ్లాదేశ్ వలస కార్మికులకు మరణశిక్ష విధించడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారాయి. అసలు వీరిద్దరు చేసిన నేరం? విచారణ ఎలా సాగింది? బంగ్లాదేశ్ ప్రభుత్వానికి ముందస్తు సమాచారం ఇచ్చారా.? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ ఘటనపై బంగ్లాదేశ్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. నజ్రుల్ ఇస్లాం, సితి అఖ్తర్ అనే జంట మక్కాలోని పవిత్ర మసీదులో 'అనైతిక చర్య'కు పాల్పడ్డారని సౌదీ చెబుతోంది. కానీ అసలు ఆ చర్యలు ఏమిటో సౌదీ అధికారులు చెప్పడం లేదు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ప్రకారం.. మసీదులో ముద్దు పెట్టుకున్నందుకే వీరిద్దరికి మరణశిక్ష విధించారని తెలుస్తోంది. సితిని నజ్రుల్ నుదిటిపై మాత్రమే ముద్దు పెట్టుకున్నాడనే వాదన కూడా ఉంది. నజ్రుల్ ఇస్లాం బంగ్లాదేశ్‌లోని చటచట్టోగ్రామ్ డివిజన్ పరిధిలోని బ్రాహ్మణబారియా సదర్ ప్రాంతానికి చెందినవాడు. కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలిచేందుకు 2022 నవంబర్‌లో సౌదీ అరేబియాకు వెళ్లాడు. మక్కాలోని మస్జిద్ అల్ హరామ్‌లో క్లీనర్‌గా పనిచేస్తున్నట్లు బంగ్లా మీడియా పేర్కొంది. నజ్రులు కుటుంబ సభ్యుల ప్రకారం నజ్రుల్ సౌదీ వెళ్లిన 8 నెలలకే జైలు పాలయ్యాడని చెబుతున్నారు. అప్పటి నుంచి మరణశిక్ష అమలయ్యే వరకు జైలులోనే ఉన్నట్లు బంధువులు చెబుతున్నారు. అక్టోబర్ 11న నజ్రుల్‌తో చివరిసారిగా మాట్లాడినట్లు కుటుంబం చెబుతోంది. అక్టోబర్ 14న మరణశిక్ష అమలైనట్లు ఫోన్ ద్వారా సమాచారం అందిందని చెబుతున్నారు. నజ్రుల్ తండ్రి అబ్దుల్ బాసిర్ గతంలో 24 ఏళ్ల పాటు సౌదీలో పనిచేశారు. తన కుమారుడికి న్యాయమైన విచారణ జరిగిందా? అన్యాయంగా శిక్ష విధిస్తే తనకు న్యాయం చేయాలని కన్నీటిపర్యంతమవుతున్నారు. నజ్రుల్ చాలా మర్యాదస్తుడని అతడి కుటుంబం చెబుతోంది. సితి అఖ్తర్, నజ్రుల్‌తో ఉన్న సంబంధంపై భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. నజ్రుల్ తండ్రి అబ్దుల్ బాసిర్ ప్రకారం.. సితి తన కుమారుడి భార్య కదాని, ఆమె ఎవరో తెలియనది చెప్పినట్లు అక్కడి మీడియా పేర్కొంది. ఇద్దరిపై ఏ ఆరోపణలు ఉన్నాయనేది వెల్లడించకపోవడం, విచారణలో సరైన విధానం పాటించారో లేదో తెలియపరకపోవడం, కుటుంబాలకు ముందస్తు సమాచారం ఇవ్వకపోవడం వంటి అంశాలు ఇప్పుడు ప్రస్తావనకు వస్తున్నాయి. బంగ్లాదేశ్ జర్నలిస్టులు, న్యాయవాదులు ఈ కేసులో పారదర్శకతను ప్రశ్నిస్తున్నారు. మరోవైపు, తన పౌరులకు విధించిన శిక్షపై తమకు సమాచారం లేదని బంగ్లాదేశ్ ప్రభుత్వం చెబుతోంది. అక్టోబర్ 14న మరణశిక్షలు అమలైన విషయం తమకు ముందుగా తెలియదని బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ సహాయ మంత్రి షమా ఒబైద్ ఇస్లాం అన్నారు.
Home
committed an "immoral act" within the sacred mosque in Mecca
international
Nazrul Islam and Siti Akhtar
Saudi Arabia Sentences Two Bangladeshi Migrant Workers to Death
ఇద్దరు బంగ్లాదేశ్ వలస కార్మికులకు మరణశిక్ష విధించిన సౌదీ అరేబియా
Subscribe to:
Post Comments (Atom)
Follow by Email
If you like Articles on this blog, Please subscribe for free via email.
Liên Kết Bạn Bè
Bình Luận Mới Nhất
Trending
Archive
Updates
Wikipedia
Search results
Comments
Recent
Fashion
News
Food
Sports
Tech News $ Scince latest
Food
Technology
Menu Footer Widget
Featured
Videos
Ticker
6/recent/ticker-posts
Comment
Ad Code
THỐNG KÊ BLOGSPOT
Configure Archive
Search This Blog
Advertisement
Masukkan script iklan 300x600px
Menu Atas
About
Ad Space
Business
Recent Post
About Me
NGƯỜI THEO DÕI BLOG
Topik Populer
Translate
Travel the world
Berita Terbaru
Pages
Pages
স্বাগতম! অনলাইনে ইনকাম, ফ্রিল্যান্সিং, এসইও এবং ডিজিটাল মার্কেটিং এর সকল তথ্য পেতে যুক্ত থাকুন টেক বাংলা ইনফো-এর সাথেই থাকুন।

