గురజాల వైసీపీ ఆఫీస్ వద్ద లాఠీఛార్జ్

ఆంధ్రప్రదేశ్ లోని పల్నాడు జిల్లా  గురజాల నియోజకవర్గం గురజాల పట్టణంలో వైసీపీ కార్యాలయం నుంచి ఎంపీపీ, ఎంపీటీసీ అభ్యర్థులు నామినేషన్ వేయటానికి వెళ్తున్న అభ్యర్థులను, ముఖ్య నాయకులు, కార్యకర్తలను 144 సెక్షన్ అమల్లో ఉందని గుంపులుగా వెళ్లకూడదని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రోడ్డుపై బైఠాయించిన కార్యకర్తలు వైసీపీ అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తలపై పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. తీవ్ర ఉద్రక్తత పరిస్థితిలో వైసీపీ పార్టీకి చెందిన ముఖ్య నాయకులు వై మురళీధర్ రెడ్డి, కొమ్మినేని వెంకటేశ్వర్లు, మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థి పోలు వీరారెడ్డి, తదితర ముఖ్య నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు.

No comments:

Post a Comment

3