Monday, October 19, 2026

సిమెంట్ పైపుల లోడుతో వెళ్తున్న మిని లారీని ఢీకొట్టిన కారు : మహిళ దుర్మరణం

హైదరాబాద్ లోని పెద్ద గోల్కొండ ఔటర్ రింగ్ రోడ్డు వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందగా, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. వివరాల్లోకి వెళితే సిమెంట్ పైపుల లోడుతో వెళ్తున్న అశోక్ లేలాండ్ మిని లారీను వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. కారు నడుపుతున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద సమాచారం అందుకున్న శంషాబాద్ ఆర్‌జీఐఏ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కారు అతివేగమే ప్రమాదానికి కారణమా, లేక మరేదైనా కారణం ఉందా అనే కోణంలో పోలీసులు విచారణ చేపడుతున్నారు. మృతురాలి వివరాలు, ప్రమాదానికి సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.