Tuesday, October 20, 2026

హైదరాబాద్‌లో కారుతో వాటర్‌ పైపు లైన్‌ను ఢీకొట్టిన వ్యక్తి : అక్కడికక్కడే మృతి : పగిలిపోయిన ప్రధాన పైపు లైను

హైదరాబాద్‌ లోని నాగోల్‌ మెట్రోస్టేషన్‌ సమీపంలో కారు బీభత్సం సృష్టించింది. హయత్‌నగర్‌కు చెందిన ఓ వ్యక్తి కారుతో వాటర్‌ పైపు లైన్‌ను ఢీకొట్టాడు. దీంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. కారు ఢీకొనడంతో జల మండలి ప్రధాన పైపు లైను పగిలిపోగా రోడ్డును నీరు ముంచెత్తింది. భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. కొంతసేపు నీటి సరఫరా ఆగిపోయింది. జలమండలి సిబ్బంది పైప్‌లైన్‌కు మరమ్మతులు చేపట్టారు.