Sunday, October 18, 2026

గవర్నర్‌ను అబ్దుల్ నజీర్‌ను కలిసి వైసీపీ నామినేషన్ల అడ్డగింతపై ఫిర్యాదు చేసిన జగన్‌మోహన్ రెడ్డి

ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి కలిసి రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, ఎన్నికల ప్రక్రియ సందర్భంగా చోటుచేసుకుంటున్న పరిణామాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వైసీపీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయకుండా అడ్డుకుంటున్నారని జగన్ ఫిర్యాదు చేశారు. నామినేషన్ ప్రక్రియలో అభ్యర్థులకు ఎదురైన ఇబ్బందులతో పాటు, వైసీపీ నాయకులు, అభ్యర్థులపై దాడులు జరిగిన ఘటనలను గవర్నర్‌కు వివరించారు. ఎన్నికల సమయంలో ఇలాంటి పరిణామాలు ప్రజాస్వామ్య ప్రక్రియపై ప్రభావం చూపే అవకాశం ఉందని జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే అంశాలపై వైఎస్ జగన్ ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. తాజాగా గవర్నర్‌ను కలిసి సమస్యలను వివరించారు.నామినేషన్ల ప్రక్రియ సజావుగా సాగేందుకు, అభ్యర్థులకు తగిన రక్షణ కల్పించేందుకు సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.