Tuesday, October 20, 2026

దసరా ఉత్సవాల్లో ఉద్రిక్తత బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణుల మధ్య ఘర్షణ : ఆందోళనకారులపై లాఠీఛార్జ్ చేసిన లాఠీఛార్జ్

తెలంగాణ లోని మెదక్ జిల్లా శివంపేటలో విజయదశమి ఉత్సవాల సందర్భంగా తీవ్ర రాజకీయ ఉద్రిక్తత చోటుచేసుకుంది. వేడుకలు జరుగుతున్న సమయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల కార్యకర్తల మధ్య విభేదాలు తలెత్తాయి. అనంతరం తీవ్ర ఘర్షణకు దిగారు. ఇరువర్గాల నాయకులు, కార్యకర్తలు పరస్పర దాడులు చేసుకున్నారు. దీంతో స్థానికంగా ఉన్న ప్రజలు, భక్తులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. అయితే ఇరువర్గాలు వెనక్కి తగ్గకపోవడంతో పాటు ఆందోళన తీవ్రతరం కావడంతో ఆందోళనకారులపై లాఠీఛార్జ్ చేశారు. దీంతో ఇరు వర్గాల కార్యకర్తలు చెల్లాచెదరయ్యారు. ప్రస్తుతం శివంపేట పరిసర ప్రాంతాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.