హైదరాబాద్‌లో నిర్వహించిన పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పోలీస్ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులన్నింటినీ 2028 నాటికి భర్తీ చేస్తామని ప్రకటించారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణే తమ ప్రథమ లక్ష్యమని, రాష్ట్రం సమగ్ర అభివృద్ధి సాధించాలంటే పోలీస్ వ్యవస్థను మరింతగా బలోపేతం చేయడం అత్యంత అవసరమని స్పష్టం చేశారు. ఇప్పటికే పోలీసు శాఖలో 5,000 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేశామని వివరించారు. రాష్ట్ర చరిత్రలోనే మొదటిసారిగా ఒకేసారి 112 మంది డీఎస్పీ పోస్టులను భర్తీ చేయడం అపూర్వమైన ఘట్టమని, మిగిలిన పోస్టులను దశలవారీగా భర్తీ చేస్తామని తెలిపారు. విధినిర్వహణలో ప్రాణాలు అర్పించిన అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వం చెల్లించే ఎక్స్‌గ్రేషియాను కూడా భారీగా పెంచుతున్నట్లు రేవంత్ రెడ్డి వెల్లడించారు. బాధ్యతలు నిర్వర్తిస్తూ అమరులైన హోంగార్డుల కుటుంబాలకు ఇచ్చే పరిహారాన్ని రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షలకు పెంచుతున్నట్లు చెప్పారు. ఇతర పోలీసు సిబ్బందికి అందించే ఎక్స్‌గ్రేషియాను సైతం పెంచారు. హెడ్ కానిస్టేబుళ్లు, ఏఎస్ఐల కుటుంబాలకు ఇచ్చే పరిహారాన్ని రూ. 45 లక్షల నుంచి రూ. 1 కోటికి పెంపు చేశారు. ఎస్ఐలు, ఇన్స్పెక్టర్ల పరిహారాన్ని రూ. 1.25 కోట్లకు పెంచారు. డీఎస్పీలు, అదనపు ఎస్పీలకు రూ. 1.50 కోట్లు, ఎస్పీలు, ఐపీఎస్ అధికారుల కుటుంబాలకు చెల్లించే పరిహారాన్ని రూ. 1 కోటి నుంచి ఏకంగా రూ. 2 కోట్లకు పెంచారు. ఈ ఆర్థిక సాయం అమరవీరుల త్యాగాలకు ప్రభుత్వం అందిస్తోన్న గౌరవమని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ పెంపునకు సంబంధించి తక్షణమే అవసరమైన ఉత్తర్వులు జారీ చేయాలని వేదికపై ఉన్న రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్‌ను ఆదేశించారు. సమాజంలో ట్రాన్స్జెండర్ల ఆత్మగౌరవాన్ని పెంపొందించడానికి వారిని ట్రాఫిక్ అసిస్టెంట్లుగా నియమిస్తోన్నామని రేవంత్ రెడ్డి చెప్పారు. పోలీసు సిబ్బంది సంక్షేమంలో భాగంగా హోంగార్డుల నుంచి డీజీపీ స్థాయి అధికారుల పిల్లల వరకు నాణ్యమైన చదువును అందించడానికి 'యంగ్ ఇండియా పోలీస్ స్కూల్'ను నెలకొల్పామని వివరించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుంటూనే, పోలీసుల వైఖరి ఎల్లప్పుడూ మానవతా దృక్పథంతో కూడి ఉండాలని సీఎం సూచించారు. ఆహార కల్తీపై కఠినంగా వ్యవహరించేందుకు టీజీ సేఫ్, అత్యవసర సమయాల్లో తక్షణ రక్షణ కల్పించేందుకు స్పందన బృందాలను అందుబాటులోకి తెచ్చినట్లు చెప్పారు. మహిళల భద్రత కోసమే కాకుండా సమాజంలో బాధ్యతను పెంచేందుకు షీ టీమ్స్, స్టాండ్ విత్ హర్ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని వివరించారు. మత్తు పదార్థాల విక్రయాలను అరికట్టడంలో నిరంతరం శ్రమిస్తున్న 'ఈగిల్ ఫోర్స్' బృందాన్ని సీఎం ప్రత్యేకంగా అభినందించారు.
2028 నాటికి పోలీస్ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులన్నీ భర్తీ : విధినిర్వహణలో ప్రాణాలు అర్పించిన అమరవీరుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా భారీగా పెంపు
by Telugu Lo Computer at October 21, 2026About Telugu Lo Computer
This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
Related Posts
Subscribe to:
Post Comments
(
Atom
)
3



No comments:
Post a Comment