Tuesday, October 20, 2026

ఆత్మకూరులో రూ.42 లక్షల నగదు పట్టివేత

ఆంధ్రప్రదేశ్ లోని నంద్యాల జిల్లా ఆత్మకూరు పెద్ద బజారు వీధిలోని ఇంట్లో దొరికిన 42 లక్షల రూపాయల అనుమానిత నగదు వివరాలను ఆత్మకూరు డి.ఎస్.పి రామాంజి నాయక్ మీడియాకు వెల్లడించారు. పట్టణంలో రియల్ ఎస్టేట్ వ్యాపారి భీమిశెట్టి కృష్ణమూర్తి ఇంట్లో ఓటర్లకు పంచేందుకు రాజకీయ పార్టీ భారీ నగదును దాచిందనే సమాచారంతో తనిఖీ చేయగా ఈ నగదు దొరికిందన్నారు. ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్, మునిసిపల్ సిబ్బంది సమక్షంలో స్వాధీన పరుచుకొని పంచనామా చేశామని ఆత్మకూరు డీఎస్పీ తెలిపారు. అనుమానిత నగదుకు సంబంధించి సరైన వివరాలు, పత్రాలు లేనందున ఆ నగదును ఆదాయ పన్ను శాఖ అధికారులకు అప్పగించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డి.ఎస్.పి వివరించారు.