రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా కూటమి నాయకులు ప్రవర్తిస్తున్నారు !

ఆంధ్రప్రదేశ్ లోని కడప జిల్లా పులివెందులలో వైసీపీ నేతల ఆస్తులే టార్గెట్‌గా దాడులు, అరాచకాలు జరగడంపై ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా కూటమి నాయకులు ప్రవర్తిస్తున్నారంటూ మండిపడ్డారు. వైసీపీ నేతలు ఆస్తులు వైసీపీ నేతలు టార్గెట్ చేసి దాడులు అరాచకాలు పాల్పడుతున్నారని ఆరోపించారు. వారం రోజులుగా పులివెందులతో పాటు చాలా ప్రాంతాల్లోనూ దాడులు చేశారని వ్యాఖ్యానించారు. నామినేషన్ వేయాలంటే, నామినేషన్ పరిశీలన పూర్తి చేసుకోవాలంటే యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఉందని ధ్వజమెత్తారు. వీటన్నిటి నుంచి బయటపడిన ప్రయోజనం లేదని, ప్రశాంతంగా స్వేచ్ఛగా ప్రచారం చేసుకునే పరిస్థితి లేదన్నారు. నాలుగు రోజుల క్రితం పులివెందులలో ఒక చికెన్ సెంటర్‌ను తగలబెడుతున్న దృశ్యాలు స్పష్టంగా ఉన్నాయని, అయినా ఇప్పటివరకు నిందితులపై చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. ఆ షాపును తగలబెట్టిన టిడిపి నాయకులు విజయ్ కుమార్ రెడ్డి, షామీరని స్పష్టంగా తెలుస్తున్న ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు. కౌన్సిల్ అభ్యర్థి నిరంజన్ రెడ్డి చెందిన చెక్కులను కాల్చివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత స్పష్టంగా దాడులుపై సమాచారం తెలుస్తున్న పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు. పోలీసులు దగ్గరుండి ప్రోత్సహిస్తూ ఈ దాడులు చేయిస్తున్నారన్న అనుమానం తమకు కలుగుతోందని అవినాష్ రెడ్డి పేర్కొన్నారు. ''పోలీసులు అధికార యంత్రం ఇంత బుడిజన్ చేయాల్సిన అవసరం ఎందుకొస్తుందో అని ప్రశ్నిస్తున్నాం. ఒకరిద్దని భయపడితే ప్రచారం చేసుకోకుండా భయపడి వెనక్కి వెళ్తారని వాళ్ళ ఆలోచన. మరో అభివృద్ధి బైక్ కాల్చారు ఇంటిపై పెట్రోల్ పోసి తగలబెట్టేందుకు ప్రయత్నించారు. స్థానికులు మేలుకోడంతో అక్కడినుంచి పారిపోయారు. వైసిపి పెడుతున్న భయపడితే ప్రచారానికి రారని ఆలోచిస్తున్నారు. నామినేషన్ కేంద్రం వద్ద జరిగిన ఘటన సంబంధించి దాదాపు 900 మంది పైన కేసులు పెట్టారు. సంబంధం లేని అరెస్టు చేస్తున్నారు'' అని ఎంపీ అవినాష్ రెడ్డి ఆరోపించారు.

No comments:

Post a Comment

3