Monday, October 19, 2026

చర్చిలో సిలువ హఠాత్తుగా కుప్పకూలి ఫాదర్ దుర్మరణం

ఈక్వెడార్ లోని ఓ చర్చిలో జీవితానికి మరణం అనివార్యమని విశ్వాసుకులకు ఫాదర్ సందేశం ఇస్తున్న క్రమంలో గోడకు ఉన్న ఓ భారీ శిలువ హఠాత్తుగా కుప్పకూలి ఫాదర్ పై పడడంతో ప్రాణాలు కోల్పోయారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ ఘటన అక్టోబర్ 17న రాత్రి అవర్ లేడీ ఆఫ్ పర్పెచ్యువల్ హెల్ప్ అనే చర్చిలో జరిగినట్లు తెలుస్తోంది. ఓ వైపు ప్రార్థనలు జరుగుతున్న సమయంలో తలపై జీసస్ సిలువ పడి ఫాదర్ చర్చిలోనే మరణించడంతో అక్కడ ఆందోళనకర, భయానక పరిస్థితులు నెలకున్నాయి.