Monday, October 19, 2026

అక్టోబర్ 22న ఒప్పో ఫైండ్ ఎక్స్ 10 సిరీస్ విడుదల

దేశీయ మార్కెట్లో అక్టోబర్ 22న ఒప్పో ఫైండ్ ఎక్స్ 10 సిరీస్ ను ఒప్పో  లాంచ్ చేస్తోంది. ఈ ఫోన్ తో పాటు ఇదే సిరీస్ ప్రీమియం ఫోన్ ఫైండ్ ఎక్స్ 10 అల్ట్రా కూడా లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ లో వెనుక క్వాడ్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 200MP Hasselblad మెయిన్ కెమెరా, 200MP Hasselblad అల్ట్రా సెన్సింగ్ టెలిఫోటో కెమెరా, 50MP అల్ట్రా వైడ్ కెమెరా మరియు నాల్గవ త్రు కలర్ కెమెరా ఉంటాయి. అంతేకాదు, ఈ కంప్లీట్ సెటప్ తో ఈ ఫోన్ లో నిజమైన రంగులు అందించే Luma కలర్ టెక్ కూడా అందించింది. ఈ ఫోన్ ఫీచర్స్ ని కూడా ఒప్పో టీజింగ్ చేసింది. కెమెరా 8K వీడియో రికార్డింగ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. అంతేకాదు, ఈ ఫోన్ 120 FPS తో 4K డాల్బీ విజన్ వీడియో రికార్డింగ్ సపోర్ట్ కూడా కలిగి ఉంది. అలాగే, 8K అల్ట్రా క్లియర్ ఫోటోలు, AI ఫోటో ఏజెంట్ మరియు లేటెస్ట్ AI కెమెరా ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ తో మరింత జూమ్ కోసం కొత్త టెలీ కన్వర్టర్ ని కూడా లాంచ్ చేస్తోంది. ఈ రెండింటి కలయికతో ఇది అత్యద్భుతమైన ఫోటోలు మరియు వీడియోలు అందిస్తుందని ఒప్పో చెబుతోంది. ఒప్పో ఈ ఫోన్ ను 3nm టెక్నాలజీ తో నడిచే మీడియాటెక్ Dimensity 9600M చిప్ సెట్ తో ఈ ఫోన్ ను లాంచ్ చేస్తున్నట్లు కన్ఫర్మ్ చేసింది. ఇది ఈ ఫోన్ ను చాలా వేగంగా ఉంచుతుంది మరియు అద్భుతమైన కెమెరా క్యాపబిలిటీ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ మరిన్ని ఫీచర్స్ కూడా లాంచ్ కంటే ముందే రివీల్ చేసే అవకాశం ఉంది.