విజయవాడ ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భవానీ భక్తులు

విజయవాడ లోని ఇంద్రకీలాద్రి క్షేత్రానికి గురువారం పెద్ద ఎత్తున భవానీ భక్తులు తరలివచ్చారు. అమ్మవారి సన్నిధికి విచ్చేసిన భవాని భక్తులతో ప్రత్యేకంగా ఆలయ ఈవో శీనా నాయక్ మాట్లాడారు. క్యూ లైన్ లో ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయని, త్రాగు నీరు సౌకర్యం ఇతర వివరాలు సేకరించారు. క్యూ లైన్ లో ఏర్పాట్లు బాగున్నాయని భవానీ దీక్షలు చేపట్టిన తమకు అమ్మవారి సన్నిధిలో ఏర్పాట్లు సంతృప్తికరంగా ఉన్నాయని భవాని భక్తులు పేర్కొన్నారు.

No comments:

Post a Comment

3