కాఫీ - ఆరోగ్య ప్రయోజనాలు !

ప్రతిరోజు ఉదయం కాఫీ తాగడం వల్ల యాక్టివ్‌ ఉండడమే గాక, తీవ్రమైన ఆరోగ్య సమస్యల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుందని, దీర్ఘాయువులో కీలక పాత్ర పోషిస్తుందని పలు అధ్యయనాలు వెల్లడించాయి.  మితంగా తాగితేనే ఈ ప్రయోజనాలు పొందగలమని అంటున్నారు. అలాంటి ప్రయోజనాలు పొందాంటే ఎలా తాగాలో, ఏవిధంగా ఎప్పటికీ తాగకూడదు సవివరంగా వెల్లడించారు. క్రమం తప్పకుండా కాఫీ తాగితే ఫ్యాటీ లివర్, సిర్రోసిస్ వంటి కాలేయ వ్యాధుల ప్రమాదం తగ్గుతుందని పరిశోధనల్లో తేలింది. అలాగే ఇది కొవ్వు పేరుకుపోకుండా నిరోధించి కాలేయాన్ని రక్షిస్తుంది. కాఫీలో శక్తివంతమైన పాలీఫెనాల్స్ ఉంటాయి, ఇవి ఇన్సులిన్ పనితీరుని మెరుగుపరుస్తాయి. ఒక కప్పు కాఫీ తాగడం వల్ల టైప్-2 మధుమేహం వచ్చే ప్రమాదం 8% తగ్గుతుంది, 2 కప్పులు తాగితే 15% కాఫీ తాగే మహిళలకు ఎండోమెట్రియల్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటుందట. కాఫీలోని యాంటీ ఆక్సిడెంట్లు కణాలను డీఎన్‌ఏ నుంచి రక్షిస్తాయి. కాఫీ ఈస్ట్రోజెన్ జీవక్రియ జరిగే విధానాన్ని మారుస్తుంది, తద్వారా రక్తప్రవాహంలో ప్రసరించే ఫ్రీ ఈస్ట్రోజెన్ స్థాయిలను సమర్థవంతంగా తగ్గిస్తుంది. కాఫీలోని ఇతర సమ్మేళనాలు పార్కిన్సన్స్‌ వ్యాధి ప్రమాధాన్ని తగ్గిస్తాయట. కెఫీన్‌కు మెదడు ఆరోగ్యానికి తోడ్పడే న్యూరోప్రొటెక్టివ్ ప్రభావాలు ఉంటాయట. అందువల్ల దీన్ని క్రమం తప్పకుండా తీసుకుంటే పార్కిన్సన్స్ వ్యాధి వచ్చే ప్రమాదం 37% తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.కాఫీలోని పాలిఫెనాల్స్ ఆక్సిడేటివ్ ఒత్తిడిని ఎదుర్కొని, దీర్ఘకాలిక మంటను తగ్గిస్తాయి, తద్వారా గుండె పనితీరు మెరుపడుతుందట. అంతేగాదు గుండె వైఫల్యం, అరిథ్మియాస్‌ ప్రమాదం కూడా తగ్గుతుందట. అలాగే పక్షవాత మరణాలు 19% తగ్గుతాయి. పొయ్యి మీద నుంచి తీసిన వెంటనే దాన్ని ఎప్పుడూ తాగవద్దు. చల్లగా ఉంటేనే సురక్షితం. 65 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలో ఉండే వేడి పానీయాలు అన్నవాహిక కేన్సర్ ప్రమాదాన్ని పెంచే అవకాశం ఉంది. మరీ వేడిగా ఉండకూడదు, మరీ తీపిగా ఉండకూడదు, మరీ ఆలస్యంగా ఉండకూడదని నిపుణులు అంటున్నారు.

No comments:

Post a Comment

3