Monday, October 19, 2026

ఆసియా పారా క్రీడల్లో సౌమ్య కుమారి, రాధా వెంకటేశ్ కు స్వర్ణాలు

ఆసియా పారా క్రీడల్లో భారత అథ్లెట్లు అద్భుత ప్రదర్శనతో పతకాల పంట పండిస్తున్నారు. మహిళల 1500 మీటర్ల టీ12, 13 విభాగంలో సౌమ్య కుమారి 5 నిమిషాల 12.39 సెకన్లలో రేసును ముగించి స్వర్ణం సాధించింది. ఇదే విభాగంలో రాధా వెంకటేశ్ 5 నిమిషాల 30.90 సెకన్ల టైమింగ్తో సిల్వర్ మెడల్ గెలుచుకుంది. అలాగే, పురుషుల జావెలిన్ త్రోలో రింకూ హూడా స్వర్ణం, అజీత్ సింగ్ రజతం గెలుచుకున్నారు.