ఫ్రాన్స్‌లో నిరసనలు, అల్లర్లకు అనియంత్రిత వలసలే కారణమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఇతర దేశాల నుంచి ఫ్రాన్స్‌కు వచ్చిన వలసదారులు తమ హృదయాల్లో ద్వేషాన్ని నింపుకుని ఒకప్పుడు ఎంతో గొప్పగా ఉన్న దేశాన్ని నాశనం చేస్తున్నారని ఆరోపించారు. ఫ్రాన్స్ తక్షణమే తన సరిహద్దులను మూసివేసి వలసలను అదుపు చేయాలని సూచించారు. నిరసనలు, అల్లర్లతో ఫ్రాన్స్ అట్టుడికిపోతుంది. దేశంలో నిత్యవసరాల పెరుగుదల, పాఠశాలల్లో పరిస్థితులు దిగజారడం, విద్యా సదుపాయాల కొరత వంటి సమస్యలపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థులు, యువత పెద్ద ఎత్తున రోడ్డెక్కారు. ఒక ప్రాంతంలో ప్రారంభమైన నిరసనలు క్రమంగా దేశవ్యాప్తంగా విస్తరించాయి. జీవన వ్యయాలు పెరగడం, ప్రజా సేవల నాణ్యత తగ్గడం, ఆర్థిక ఇబ్బందులపై ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడం లేదన్న అసంతృప్తితో కార్మిక సంఘాలు, ఇతర వర్గాలు కూడా ఉద్యమంలో చేరాయి. పారిస్‌లో ప్రధాన ర్యాలీ ప్రశాంతంగానే సాగింది. కానీ పలుచోట్ల నిరసనకారులు ఆగ్రహానికి గురికావడంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. నిరసనకారులు వీధుల్లో నిప్పు పెట్టడంతో పాటు వాహనాలను, ప్రభుత్వ భవనాలను తగులబెట్టారు. ప్రముఖ ప్రాంతమైన ప్లాస్ ద లా రిపబ్లిక్ సమీపంలోనూ వాహనాలకు నిప్పంటించారు. అనంతరం పోలీసులకు, నిరసనకారులకు మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు టియర్ గ్యాస్, వాటర్ క్యానన్లను ప్రయోగించారు. పోలీసులు నిరసనకారులపైకి దూసుకెళ్లి లాఠీలతో కొడుతున్న దృశ్యాలు కూడా వెలుగులోకి వచ్చాయి. ఫ్రాన్స్‌లో అంతర్గత నిరసలు, అల్లర్లకు వలసలే కారణమని అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ పదే పదే చెబుతున్నారు. కానీ అల్లర్లపై ఫ్రాన్స్ ప్రభుత్వం, నిరసనకారుల వాదన మరోలా ఉంది. దేశంలో అల్లర్లకు వలసలు కారణం కాదని.. పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత, ఆర్థిక ఇబ్బందులు, నిత్యవసరాల పెరుగుదలే కారణమని ప్రభుత్వం, నిరసనకారులు చెబుతున్నారు. దేశంలో ప్రస్తుతం జరుగుతోన్న నిరసనలకు వలసలతో లేదా మరే ఇతర మతపరమైన అంశాలతో సంబంధం లేదని ఫ్రాన్స్ ప్రభుత్వం స్పష్టం చేసింది.
Home
international
says US President Donald Trump
The country must immediately close its borders and bring immigration under control
Uncontrolled immigration is the cause of protests and riots in France
ఫ్రాన్స్‌లో నిరసనలు, అల్లర్లకు అనియంత్రిత వలసలే కారణం : తక్షణమే తన సరిహద్దులను మూసివేసి వలసలను అదుపు చేయాలి : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్
Subscribe to:
Post Comments (Atom)
Follow by Email
If you like Articles on this blog, Please subscribe for free via email.
Liên Kết Bạn Bè
Bình Luận Mới Nhất
Trending
Archive
Updates
Wikipedia
Search results
Comments
Recent
Fashion
News
Food
Sports
Tech News $ Scince latest
Food
Technology
Menu Footer Widget
Featured
Videos
Ticker
6/recent/ticker-posts
Comment
Ad Code
THỐNG KÊ BLOGSPOT
Configure Archive
Search This Blog
Advertisement
Masukkan script iklan 300x600px
Menu Atas
About
Ad Space
Business
Recent Post
About Me
NGƯỜI THEO DÕI BLOG
Topik Populer
Translate
Travel the world
Berita Terbaru
Pages
Pages
স্বাগতম! অনলাইনে ইনকাম, ফ্রিল্যান্সিং, এসইও এবং ডিজিটাল মার্কেটিং এর সকল তথ্য পেতে যুক্ত থাকুন টেক বাংলা ইনফো-এর সাথেই থাকুন।

