ఢిల్లీలో మరోసారి విజృంభించిన వాయు కాలుష్యం : గ్రేడెడ్‌ రెస్పాన్స్‌ యాక్షన్‌ ప్లాన్‌-1 నిబంధనలను తక్షణమే అమల్లోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించిన సీఏక్యూఎం

ఢిల్లీలో వాయు కాలుష్యం మరోసారి విజృంభించింది. స్థానికంగా వాయు నాణ్యత సూచీ దిగజారడంతో 'సెంట్రల్‌ ఎయిర్‌ క్వాలిటీ మేనేజ్‌మెంట్ (సీఏక్యూఎం)' ఈ సీజన్‌లో తొలిసారి ఆంక్షలు విధించింది. ఢిల్లీ - ఎన్‌సీఆర్‌ పరిధిలో 'గ్రేడెడ్‌ రెస్పాన్స్‌ యాక్షన్‌ ప్లాన్‌-1 నిబంధనలను తక్షణమే అమల్లోకి తీసుకొస్తున్నట్లు సీఏక్యూఎం ప్రకటించింది. ఈ నేపథ్యంలో సెంట్రల్‌ ఎయిర్‌ క్వాలిటీ మేనేజ్‌మెంట్ ఛైర్‌పర్సన్‌ రాజేశ్‌ వర్మ.. ఉన్నతాధికారులు, పలు ప్రభుత్వ విభాగాలతో సమక్షా సమావేశం నిర్వహించింది. నగరంలో వాయు కాలుష్య సమస్యపై సమీక్షించడంతో పాటు రాబోయే రోజుల్లో కాలుష్య నివారణ చర్యలపై చర్చించారు.ఢిల్లీలో ఈ నెల 20న వాయు నాణ్యత సూచీ 179గా నమోదు కాగా ఇవాళ మధ్యాహ్నం 2గంటలకు 244కి ఒక్కసారిగా పెరిగిందని సీఏక్యూఎం పేర్కొంది. రాబోయే రోజుల్లో వాయు నాణ్యత సూచీ 'పూర్‌' కేటగిరీలోనే ఉంటుందని ఐఎండీ తెలిపింది. వాయు నాణ్యత మరింతగా క్షీణించకుండా నిరోధించేందుకు జీఆర్‌ఏపీ-1 నిబంధనలను వెంటనే అమలు చేయాలని సీఏక్యూఎం పేర్కొంది. ఈ నిబంధనల కింద గ్రాప్‌-1 కింద హోటళ్లు, రెస్టారెంట్లలో ఇంధనంగా బొగ్గు, వంట చెరకు వాడకూడదు. అలానేఅత్యవసర పరిస్థితుల్లో మాత్రమే డీజిల్‌ జనరేటర్ల వాడకానికి అనుమతించాలని సీఏక్యూఎం స్పష్టం చేసింది.

Post a Comment

Previous Post Next Post