Ad Code

ఫోర్బ్స్ కవర్‌ పేజీపై అల్లు అర్జున్

భారతదేశంలోని టాప్ 100 ప్రముఖ సెలబ్రిటీలను సెలబ్రేట్ చేస్తూ రూపొందించిన ఎంతో ప్రతిష్టాత్మకమైన ఫోర్బ్స్ ఇండియా 'షోస్‌ టాపర్స్ 2026' ఎడిషన్ కవర్‌ పై అల్లు అర్జున్ ఫోటో ముద్రించారు. వివిధ రంగాల్లో రాణించిన 100 మంది తారల జాబితాను షో స్టాపర్స్ - 2026 పేరుతో ఫోర్బ్స్ ఇండియా విడుదల చేసిన సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. లాంగ్ రన్ లో ప్రపంచవ్యాప్తంగా రూ.1700 కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టింది. దాంతో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రాల్లో అగ్రస్థానం సంపాదించింది. ఈ మూవీలో అల్లు అర్జున్ ప్రత్యేకమైన స్టైల్, మేనరిజమ్స్, డ్యాన్స్, స్క్రీన్ ప్రెజెన్స్, భాష ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యాయి. ఇక ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో రాకా అనే మూవీ చేస్తున్నారు అల్లు అర్జున్. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది.

Post a Comment

0 Comments

Close Menu